Rhea chakraborty
Rhea chakraborty : బాలీవుడ్ లో గతేడాది మొత్తం ఒకటే టాపిక్ నడిచింది. అదే రియా చక్రవర్తి గురించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ విషయంలో రియా ఎదుర్కొన్న సిబిఐ విచారణలు, జైలుకి వెళ్ళడాలు..లాంటి వ్యవహారలతో ముంబై మీడియా మొత్తం వేడెక్కిన సంగతి తెలిసిందే. అక్కడే కాదు సౌత్ లో కూడా ఈ టాపిక్ హాట్ టాపిక్ అయింది. సెన్షేషనల్ న్యూస్ అవడంతో పాటు ఇందుకు లింక్ ఉన్న డ్రగ్స్ వ్యవహారం కూడా బయట పడింది. ఇందులో కూడా పలువురు స్టార్ సెలబ్రిటీలు విచారణ కి హాజరయ్యారు.
అయితే ఇక రియా సినిమా కెరీర్ క్లోజ్ అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా మళ్ళీ సినిమాలలో అవకాశం అందుకుంది. ఇప్పుడు ఈ న్యూస్ అటు నార్త్ ఇటు సౌత్ మొత్తం సంచలనం అవుతోంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘చెహ్రే’. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ఇమ్రాన్ హష్మి, రియా చక్రవర్తి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అమితాబ్ నటిస్తున్నందుకు ఎంత హాట్ టాపిక్ అవుతుందో రియా ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు అంతే హాట్ టాపిక్ అయింది.
Rhea chakraborty
అమితాబ్, ఇమ్రాన్ హష్మిలాంటి హై కేస్టింగ్‌తో కలిసి నటించిన గొప్ప అవకాశాన్ని అందుకున్నప్పటికి ఆ తర్వాత రియా విచారణల చుట్టూ తిరుగుతుండటం తో సినిమా నుంచి తప్పించారు. అంతేకాదు పోస్టర్స్ లో కూడా తీసేశారు. సినిమాలో రియా ఉంటే పెద్ద డామేజ్ అవుతుందన్నదే కారణం. ఈ విషయంలో చాలా మంది అమితాబ్ బచ్చన్ ని కూడా కామెంట్ చేశారు. అయితే ఎట్టకేలకి విడుదల చేసిన ట్రైలర్‌లో మాత్రం సడెన్‌గా రియా ప్రత్యక్షమయింది. దాంతో ప్రతీ ఒక్కరికీ మైండ్ బ్లాకయింది. రియా ప్లేస్ లో డూప్ ని పెట్టి తీశారన్న కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ రియా సినిమాలో ఉన్నందుకు పిచ్చి పబ్లిసిటీ వచ్చేసింది. ఏం జరిగిందో..ఎలా జరిగిందో గానీ సినిమాలో రియా గ్యారెంటీగా అందరినీ డామినేట్ చేస్తుందని..సినిమా సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం రియా కే చెందుతుంది అంటూ ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.