Home » Entertainment » Rk Roja Come Back To Jabardasth After Elections
Entertainment

Roja : 2024 తర్వాత రోజా మళ్లీ జబర్దస్త్‌ లో అడుగు పెట్టేనా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 19, 2022, 3:00 pm
Advertisement

Roja : జబర్దస్త్‌ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో రోజా పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. రోజా దాదాపు పది సంవత్సరాలుగా జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంటుంది. ఆమె చేసిన ఎన్నో కార్యక్రమాలు ఆమెకు మరింతగా పేరు తెచ్చి పెట్టాయి. దాంతో ఇప్పుడు ఏపీ లో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి యొక్క మంత్రి వర్గంలో మంత్రిగా పని చేస్తున్న విషయం తెల్సిందే.మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న వెంటనే రోజా తాను జబర్దస్త్ ను వీడబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాను ఈ స్టేజ్ నుండి ఎమ్మెల్యేగా ఎదిగాను.. మంత్రిగా కూడా ఛాన్స్ దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షూటింగ్స్ లో పాల్గొన్న రోజా మంత్రి పదవి దక్కిన వెంటనే షూటింగ్స్ అన్నింటికి కూడా గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.హీరోయిన్ గా సినీ కెరీర్ ను ఆరంభించిన రోజా ఆ తర్వాత ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. స్టార్ హీరోలకు జోడీగా నటించి స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. నటిగా ఆమె సినీ ప్రస్థానం ఎంత విజయం సాధించిందో జబర్దస్త్‌ కూడా ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టింది.

RK roja come back to Jabardasth after elections

Advertisement

అందుకే ఆమె జబర్దస్త్‌ వీడటానికి ఇబ్బంది పడింది. 2024 ఎన్నికల్లో జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకున్నా కూడా మళ్లీ మంత్రి వర్గ కూర్పులో భాగంగా రోజాకు ఛాన్స్ రాకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం. కనుక ఆ సమయంలో రోజా మళ్లీ జబర్దస్త్‌ లో అడుగు పెట్టేనా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ మద్య జబర్దస్త్ ను ఆమె వదిలింది కనుక అవకాశం ఉంటే మళ్లీ రావడం ఖాయం అంటున్నారు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి