RK Roja పాపం రోజా పని ఖ‌తం.. మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్తే దిక్కా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

RK Roja పాపం రోజా పని ఖ‌తం.. మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్తే దిక్కా..!

RK Roja : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. మెగా హీరోలు, పలువురు నిర్మాతలు, ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూటమికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. అయితే వైసీపీ ఈ ఎన్నిక‌ల‌లో దారుణ ఓట‌మి చెంద‌డంతో వారిపై ఎంత వ్య‌తిరేఖ‌తో ఉందో అర్ధ‌మైంది. కేవ‌లం వైసీపీని 10 సీట్ల‌కి మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ఇక నగరి నియోజకవర్గంలో నటి రోజా కూడా ఓటమి […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  RK Roja పాపం రోజా పని ఖ‌తం.. మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్తే దిక్కా..!

RK Roja : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. మెగా హీరోలు, పలువురు నిర్మాతలు, ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూటమికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. అయితే వైసీపీ ఈ ఎన్నిక‌ల‌లో దారుణ ఓట‌మి చెంద‌డంతో వారిపై ఎంత వ్య‌తిరేఖ‌తో ఉందో అర్ధ‌మైంది. కేవ‌లం వైసీపీని 10 సీట్ల‌కి మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ఇక నగరి నియోజకవర్గంలో నటి రోజా కూడా ఓటమి పాలైంది. ఓట‌మి దిశ‌గా సాగుతున్న స‌మ‌యంలోనే రోజా త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా భాగంగా చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేశారు.

RK Roja ఇక జ‌బ‌ర్ధ‌స్తే దిక్కా..

భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు. అని రోజా ట్వీట్ లో పేర్కొన్నారు. రోజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ చేతిలో రోజా ఓట‌మి పాలైంది. అయితే రోజా ఓట‌మి త‌ర్వాత ఆమెని కొంద‌రు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వారిలో నిర్మాత బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆర్కే రోజాపై సెటైర్లతో విరుచుకుపడ్డారు బండ్ల గణేష్. రోజా ఫొటోను షేర్ చేస్తూ “జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా ” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి రోజాను ట్యాగ్ కూడా చేశారు బండ్ల గణేష్.

RK Roja పాపం రోజా పని ఖ‌తం మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్తే దిక్కా

RK Roja పాపం రోజా పని ఖ‌తం.. మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్తే దిక్కా..!

అలానే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు ఫొటోలను షేర్ చేస్తూ “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారిని ఓటు వేసే విధంగా కసి తీసుకొచ్చిన మీ నలుగురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు” అంటూ సైటెర్ వేశారు గణేష్. గతంలో ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో రోజాకి బండ్ల గణేష్‌కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. . ఇద్దరూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఇక ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆమె మరలా జబర్దస్త్ కి వస్తారనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. అదే నిజమైతే జబర్దస్త్ కి పూర్వ వైభవం వచ్చినట్లే. జబర్దస్త్ ఒకప్పటి ఆదరణ కోల్పోయిన సంగతి తెలిసిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది