Home » Entertainment » Rk Roja Continue Jabardasth Show
Entertainment

Roja : మంత్రి ప‌ద‌వి ఆల‌స్యం.. అప్ప‌టి వ‌ర‌కు ఇదే : రోజా

Authored By
vamana sai
The Telugu News | Published on: May 11, 2021, 7:00 am
Advertisement

Roja : రోజా.. సీనియర్ స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సహా పలువురు సౌత్ స్టార్ హీరోలతో జతకట్టి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. పెళ్ళి తర్వాత సినిమాలౌ దూరమైన రోజా గోలీమార్ లాంటి సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ వస్తోంది. అయితే సినిమాల కంటే స్మాల్ స్క్రీన్ మీద రోజా సందడి ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ళుగా ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ షో జబర్దస్త్‌కు మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

Advertisement

అలాగే మరొక వైపు పొల్టికల్ కెరీర్ కూడా బాగానే కొనసాగిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న రోజాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి అధికారికంగా ప్రకటించే వరకు జబర్థస్త్ లో కొనసాగలని ఆమె నిర్ణయించుకుందట. దాదాపు ఆరేడేళ్ళుగా నాగబాబు – రోజా జబర్దస్త్‌లో జడ్జెస్‌గా కొనసాగుతున్నారు. కొన్ని సమస్యల వల్ల నాగబాబు ఈ షోకి దూరమయిన సంగతి తెలిసిందే.

RK Roja continue jabardasth show

Advertisement

Roja : రోజా కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కొంతకాలం ఈ షోకి దూరంగా ఉంది.

రోజా కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కొంతకాలం ఈ షోకి దూరంగా ఉంది. అయితే మళ్ళీ జబర్దస్త్ కు రోజా రీ ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రోజా మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఈ షో కంటిన్యూ చేస్తుందా లేక జబర్దస్త్ కు గుడ్ బై చెప్తుందా చూడాలి. ప్రస్తుతానికైతే జబర్దస్త్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇది కూడా అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి