Acharya Movie : చిక్కుల్లో ఆచార్య మూవీ.. చిరంజీవి, రెజీనా ఐటెం సాంగ్ పై పోలీసులకు ఫిర్యాదు..!

Acharya Movie : కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన ఐటెం సాంగ్ శానా కష్టం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే రెజీనా కేసండ్రాతో కలిసి చిరు మాస్ స్టెప్పులేసిన ఈ సాంగ్ ఎంత మంచి రెస్పాన్స్ ఐతే వస్తోందో..

అంతే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ ఐటెం సాంగ్ కారణంగా చిత్ర బృందం చిక్కుల్లో పడింది. మణిశర్మ టోన్ లో భాస్కరబట్ల లిరిక్స్ అందించిన శానా కష్టం సాంగ్ ఈ వివాదానికి దారి తీసింది. సాంగ్ లోని ఏడేడో నిమరోచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే అనే లిరిక్ లో… యువకులంతా రెజీనా లాంటి అందగత్తెను ముట్టుకునే అవకాశం కోసం ఆర్ఎంపీ డాక్టరవుతున్నారని అర్థం వచ్చేలా చిత్రీకరించారు.

Rmp doctors association files a complaint on Acharya movie item song

ఇప్పుడీ లైన్ పై… రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ తమ వృత్తిని అవమానించేలా ఉందంటూ.. తెలంగాణలోని జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీత రచయిత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వివాదం పై ఆచార్య చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Recent Posts

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

33 minutes ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

2 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

3 hours ago

Health Tips | వారు అస్స‌లు బొప్పాయి తిన‌కూడ‌దు.. తింటే మాత్రం…

Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…

4 hours ago

Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!

Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…

5 hours ago

September | ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు ..సెప్టెంబర్లో పట్టిందల్లా బంగారం!

September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…

6 hours ago

Flipkart Jobs : ఫ్లిప్‌కార్ట్‌ లో 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు..త్వరపడండి

Flipkart Jobs: పండుగ సీజన్‌ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్‌ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ తన బిగ్ బిలియన్ డేస్‌…

15 hours ago

Free AI Courses: సింపుల్ గా ఏఐ కోర్సులు నేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఇది చూడాలసిందే..!!

Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…

16 hours ago