Rocket Raghava: నన్ను ముంచాలని చాలామంది చూశారు.. జబర్దస్త్ రాఘవ కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 30 January 2021, 11:50 am

జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి రాఘవ అందులోనే ఉన్నాడు. ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు.. ఇంకా వస్తూనే ఉన్నారు.. వెళ్తూనే ఉన్నారు. టీం లీడర్లు మారిపోయాడు.. కంటెస్టెంట్లు టీం లీడర్లుగా ఎదిగారు. కొందరు వేరే చానెళ్లు, వేరే షోలంటూ వెళ్లిపోయారు. ఇంకొందరు బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లారు.. ఇక మరీ ముఖ్యంగా తాను దైవంలా భావించే నాగబాబు జబర్దస్త్‌ను వీడిపోయాడు. కానీ రాఘవ మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఎవ్వరూ కదిలించలేని గట్టి పునాదిలా ఉండిపోయాడు.

Rocket raghava Counters In Jabardasth

Rocket raghava Counters In Jabardasth

రాఘవ జబర్దస్త్‌కు రాక ముందు నుంచీ ఫేమస్సే. ఎన్నో సినిమాలో కామెడీ వేషాలు వేశాడు. బుల్లితెరపై ఇంకెన్నో కామెడీ షోలను చేశాడు. లైవ్ షోలను నిర్వహించాడు. అప్పుడెప్పుడో జెమినీ చానెల్‌లో వచ్చిన నవ్వుల ప్రోగ్రాంలోనూ యాంకర్‌గా ఉన్నాడు. అలా ఎన్నెన్నో చేసి చివరకు జబర్దస్త్‌లోకి వచ్చాడు. ఇక్కడకు వచ్చాకు మాత్రం అలా స్థిరంగా ఉండిపోయాడు. మధ్యలో సినిమా ఆఫర్లు వస్తుంటే.. అవి చేసుకుంటూనే జబర్దస్త్‌ను వీడకుండా ఉన్నాడు.

Rocket Raghava: జబర్దస్త్ రాఘవ కామెంట్స్..

అయితే రాకెట్ రాఘవ స్కిట్లు మరీ అంత గొప్పగా ఉండకపోయినా.. మిగతా వారిలా మరీ అంత వల్గర్‌గా, డబుల్ మీనింగ్‌లతో ఉండవు. కాస్త డీసెంట్‌గానే ఉంటుంది. అలా రాకెట్ రాఘవ తాజాగా ఓ స్కిట్‌లో మాట్లాడుతూ.. ఓ నిజం బయటపెట్టేశాడు. మొన్న పడ్డ వానలకు నువ్ మునిగిపోయినా దరిద్రం వదిలిపోయేదంటూ రాఘవపై ఓ ఆర్టిస్ట్ సెటైర్ వేశాడు. దానికి ప్రతిగా రాఘవ స్పందిస్తూ.. నన్ను ముంచాలని చాలా మంది చూశారురా.. అది మీ వల్ల కాదురా అని జబర్దస్త్ షోలోని పాలిటిక్స్‌పై అలా పరోక్షంగా పంచ్‌లు వేశాడు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి