Home » Entertainment » Rocket Raghava Satires On Getup Srinu In Jabardasth Latest Promo
Entertainment

Rocket Raghava : గెటప్ శ్రీను పరువుపాయే!.. కాంట్రవర్సీలంటూ రాకెట్ రాఘవ సెటైర్లు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 4, 2022 1:57 pm
Advertisement

Rocket Raghava : ప్రతి వారం గురు, శుక్ర వారాలలో బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, చలాకి చంటి వంటి కమెడియన్స్ మరోసారి తనదైన శైలిలో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

Advertisement

ఇక ఈ ప్రోమోలో రాకెట్ రాఘవ స్కిట్ ద్వారా గెటప్ శీను పరువు మొత్తం తీశారు. రాకెట్ రాఘవ వేదికపైకి ఎంట్రీ ఇస్తూనే… జబర్దస్త్ కార్యక్రమంలో రోజురోజుకు అకృత్యాలు నికృత్యాలుగా మారిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి అకృత్యం అంటూ గతంలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను జబర్దస్త్ వేదికపైకి వచ్చి ఇకపై మేము ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపో తెలుసుకున్నాము అంటూ చేసిన స్కిట్ కి రాఘవ స్కూప్ చేశారు.

Rocket Raghava satires on getup srinu in jabardasth latest promo

Advertisement

Rocket Raghava : ఈ స్కిట్ తో గెటప్ శీను గాలి తీసిన రాఘవ..

ఇందులో భాగంగా గెటప్ శీను చెప్పిన విధంగా మేము ముగ్గురం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి పోతున్నాము అంటూ ఇతర కమెడియన్స్ గెటప్ శీను సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ ఫోటోలను మెడలో వేసుకుని ఈ స్కిట్ చేశారు. ముఖ్యంగా గెటప్ శీను ఫోటోలో ఉన్న వ్యక్తి ఎంతో ఎమోషనల్ అవుతూ వారు జబర్దస్త్ నుంచి వెళ్లి పోతున్నట్లు స్కిట్ చేస్తూ గెటప్ శీను పరువు తీశాడు. ఈ స్కిట్ అనంతరం మమ్మల్ని క్షమించండి అంటూ వేదికపై చెప్పడంతో వెంటనే రోజా రియాక్ట్ అవుతూ ముందు మమ్మల్ని క్షమించండి రా బాబు అంటూ సెటైర్ వేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి