Rocket Raghava : గెటప్ శ్రీను పరువుపాయే!.. కాంట్రవర్సీలంటూ రాకెట్ రాఘవ సెటైర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rocket Raghava : గెటప్ శ్రీను పరువుపాయే!.. కాంట్రవర్సీలంటూ రాకెట్ రాఘవ సెటైర్లు

Rocket Raghava : ప్రతి వారం గురు, శుక్ర వారాలలో బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, చలాకి చంటి వంటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2022,3:40 pm

Rocket Raghava : ప్రతి వారం గురు, శుక్ర వారాలలో బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, చలాకి చంటి వంటి కమెడియన్స్ మరోసారి తనదైన శైలిలో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

ఇక ఈ ప్రోమోలో రాకెట్ రాఘవ స్కిట్ ద్వారా గెటప్ శీను పరువు మొత్తం తీశారు. రాకెట్ రాఘవ వేదికపైకి ఎంట్రీ ఇస్తూనే… జబర్దస్త్ కార్యక్రమంలో రోజురోజుకు అకృత్యాలు నికృత్యాలుగా మారిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి అకృత్యం అంటూ గతంలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను జబర్దస్త్ వేదికపైకి వచ్చి ఇకపై మేము ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపో తెలుసుకున్నాము అంటూ చేసిన స్కిట్ కి రాఘవ స్కూప్ చేశారు.

Rocket Raghava satires on getup srinu in jabardasth latest promo

Rocket Raghava satires on getup srinu in jabardasth latest promo

Rocket Raghava : ఈ స్కిట్ తో గెటప్ శీను గాలి తీసిన రాఘవ..

ఇందులో భాగంగా గెటప్ శీను చెప్పిన విధంగా మేము ముగ్గురం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి పోతున్నాము అంటూ ఇతర కమెడియన్స్ గెటప్ శీను సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ ఫోటోలను మెడలో వేసుకుని ఈ స్కిట్ చేశారు. ముఖ్యంగా గెటప్ శీను ఫోటోలో ఉన్న వ్యక్తి ఎంతో ఎమోషనల్ అవుతూ వారు జబర్దస్త్ నుంచి వెళ్లి పోతున్నట్లు స్కిట్ చేస్తూ గెటప్ శీను పరువు తీశాడు. ఈ స్కిట్ అనంతరం మమ్మల్ని క్షమించండి అంటూ వేదికపై చెప్పడంతో వెంటనే రోజా రియాక్ట్ అవుతూ ముందు మమ్మల్ని క్షమించండి రా బాబు అంటూ సెటైర్ వేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది