Home » Entertainment » Rohini And Rakesh Love Story At Jabardasth
Entertainment

Rohini And Rakesh : జబర్దస్త్‌తో మొత్తానికి గుట్టు బయటపడింది.. రోహిణి రాకేష్ లవ్ స్టోరీ ఇదే!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 2, 2021, 10:40 am
Advertisement

Rohini And Rakesh జబర్దస్త్ వేదిక నుంచి మరో కొత్త జంట పుట్టుకొచ్చేసింది. తామిద్దరం మంచి స్నేహితులం, కష్టసుఖాల్లో తోడుగా నిల్చున్నాం.. ఒకరికొకరం సాయం చేసుకున్నాం.. మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చిన రోహిణి, రాకేష్‌ల కథ వేరేలా మారబోతోంది. స్టేజ్ మీదే ప్రపోజ్ చేసిన రోహిణికి రాకేష్ షాకిచ్చాడు. బిగ్ బాస్ షోతో రోహిణి బాగానే ఫేమస్ అయింది. అయితే జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చాక ఇంకాస్త ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ స్కిల్స్ అందరికీ తెలిశాయి.

Advertisement

rohini and rakesh love story at jabardasth

అలా రోహిణి, రాకేష్ స్కిట్లలోనూ కొద్దిపాటి సరసాలు కూడా ఉంటాయి. ఏకంగా ఈ ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోతూ ఉంటారు. వాటిని కూడా ముద్దులు అంటారా? అని రోహిణి లైట్ తీసుకుంది. అలా రోహిణి రాకేష్ ట్రాక్ బాగానే నడుస్తోంది. అయితే వచ్చే వారం రాబోతోన్న ఎపిసోడ్‌‌లో రోహిణికి రాకేష్ షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఏకంగా ఐ లవ్యూ అంటూ ప్రపోజ్ చేసేశాడు. దీంతో జబర్దస్త్ టీం కూడా తమకు అలవాటైనట్టుగా.. లవ్ సింబల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేసింది..

Advertisement

rohini and rakesh love story at jabardasth

రోహిణి రాకేష్ రొమాన్స్.. Rohini And Rakesh

ఐదేళ్ల పరిచయానికి గుర్తుగా ఐదు రకాల బహుమతులు ఇస్తానని అన్నాడు. అలా రోజా పువ్వుతో మోకాళ్ల మీద నిల్చుని తన ప్రేమను తెలియజేశాడు రాకేష్. తన గుండెల్లో ఎప్పుడూ ఉంటావని చెబుతూ ఓ గిఫ్ట్‌ను చూపించాడు. అది చూసి రోహిణి షాక్ అయింది. అయితే ఏమైందో ఏమో గానీ రోహిణిని వదిలి రాకేష్ వెళ్లిపోయాడు. స్టేజ్ నుంచి దిగి అలా వెనక్కి వెళ్లిపోయాడు. ఇదంతా కూడా ప్రోమో కోసం చేశారా? లేదా నిజంగానే ఏదైనా జరిగిందా? అన్నది చూడాలి.

Advertisement

rohini and rakesh love story at jabardasth

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి