Home » Entertainment » Roja About Chanti In Jabardasth
Entertainment

Roja : టీం లీడర్లు అయితే ఆ పని చేయోచ్చా.. రోజా ఉద్దేశ్యం అదేనా?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 24, 2021, 8:33 pm
Advertisement

Roja  : జబర్దస్త్ షోలో కంటెస్టెంట్లు, టీం లీడర్లు అనే బేధాలుంటాయి. ఇక టీం లీడర్లు ఏం చేసినా నడుస్తుంది. కొత్తగా వచ్చే కంటెస్టెంట్లకు అసలు స్క్రీన్ స్పేస్ ఇవ్వరు. డైలాగ్‌లు అయితే అస్సలే ఉండవు. ఎక్కడో ఓ మూలన ఉంటారు. అయితే అందులోంచి కొందరు మాత్రం బయటకు వస్తారు.

Advertisement

Roja ABout Chanti In Jabardasth

పేరు సంపాదించుకుంటారు. ఇక లేడీ కంటెస్టెంట్లు ఇప్పుడిప్పుడు జబర్దస్త్ షోలో ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు అయితే కేవలం లేడీ గెటప్పులతో స్కిట్లు వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది.అందరూ కూడా జబర్దస్త్ షోలో కనిపించాలని, స్టేజ్ మీద పంచులు వేయాలని, ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు.

Advertisement

Roja ABout Chanti In Jabardasth

అలా ఇప్పుడు ఓ కంటెస్టెంట్ చంటి టీంలోకి వచ్చినట్టుంది. చంటి టీంలో ఈ మధ్య కొందరు కొత్త వాళ్లు కనిపిస్తున్నారు. వచ్చే వారం ప్రసారం కాబోతోన్న జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఓ కంటెస్టెంట్ లేడీ కంటెస్టెంట్‌ను హగ్ చేసుకోబోయాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అందరూ ఒక్కసారిగా ఓ వేసుకున్నారు.

Advertisement

 

Roja ABout Chanti In Jabardasth

Roja  : హగ్ చేసుకోవడంపై చంటి కామెంట్లు

Roja ABout Chanti In Jabardasth

అయితే అదే సీన్ చంటి చేయాల్సి వచ్చినప్పుడు కాస్త తడబడ్డాడు. ముందుకు వెనుకకు ఆలోచించాడు. టీం లీడర్లకు ఆ ఫెసిలిటీ ఉంది అంటూ ఏం కాదు హగ్ చేసుకో అన్నట్టుగా రోజా ఉసిగొల్పింది. కానీ చంటి మాత్రం అలా చేయలేదు. ఇక్కడ టీం లీడర్లకు ఆ ఫెసిలిటీ ఉంది. కానీ ఇంట్లో టీం లీడర్లకు ఉందో లేదో అని తన శ్రీమతిని గుర్తు చేసుకున్నాడు చంటి. అంటే టీం లీడర్లు జబర్దస్త్‌లో ఎలాంటి ఆధిపత్యం చూపిస్తారో చెప్పకనే చెప్పేశారు.

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి