Hyper Aadi : హైపర్ ఆదిని చాచి కొట్టేసింది.. రెచ్చిపోయిన రోజా. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : హైపర్ ఆదిని చాచి కొట్టేసింది.. రెచ్చిపోయిన రోజా.

Hyper Aadi : బుల్లితెరపై రోజా ఈ మధ్య బాగానే రెచ్చిపోతోంది. కామెంట్లు వేయడం, సెటైర్లతో స్కిట్లోకి దూరడం బాగానే చేస్తోంది. మామూలుగా అయితే ఇప్పుడు జబర్దస్త్ అంటే రోజా.. రోజా అంటే జబర్దస్త్ అన్నట్టుగా మారింది. ఇక పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు అంటే రోజా సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. తాజాగా ఉగాది స్పెషల్ అంటూ వేసిన ఈవెంట్‌లో రోజా దుమ్ములేపేసింది. ఒక్కొక్కరినీ వాయించేసింది.ఉగాది పండుగ సందర్భంగా వేసిన ఈవెంట్ కాబట్టి.. అందులో ఉగాది […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 April 2022,3:30 pm

Hyper Aadi : బుల్లితెరపై రోజా ఈ మధ్య బాగానే రెచ్చిపోతోంది. కామెంట్లు వేయడం, సెటైర్లతో స్కిట్లోకి దూరడం బాగానే చేస్తోంది. మామూలుగా అయితే ఇప్పుడు జబర్దస్త్ అంటే రోజా.. రోజా అంటే జబర్దస్త్ అన్నట్టుగా మారింది. ఇక పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు అంటే రోజా సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. తాజాగా ఉగాది స్పెషల్ అంటూ వేసిన ఈవెంట్‌లో రోజా దుమ్ములేపేసింది. ఒక్కొక్కరినీ వాయించేసింది.ఉగాది పండుగ సందర్భంగా వేసిన ఈవెంట్ కాబట్టి.. అందులో ఉగాది పచ్చడి కోసం గొడవ పడ్డారు.

ఉగాది పచ్చడి కోసం కావాల్సిన ముడి పదార్థాలన్నీ కూడా రోజా తన వద్దే పెట్టేసుకుంది. వాటిని అడిగేందుకు వచ్చిన ఆది, రాం ప్రసాద్, భాస్కర్‌లను లాగి పెట్టి కొట్టేసింది. నరేష్‌ని అయితే ఎత్తి అవతల పారేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. రోజా చర్యలకు అంతా ఆశ్చర్యపోయారు.మమ్మల్ని కొడతారా? ఆర్టిస్టులను కొడతారా? అంటూ ముందుకు వచ్చిన ఆది చెంపపగలగొట్టేసింది రోజా. అంతకు ముందు బుల్లెట్ భాస్కర్ దవడ పగిలిపోయింది. ఇక ఈ ఇద్దరి తరువాత రాం ప్రసాద్ ముందుకు వచ్చాడు.

Roja Beaten Hyper Aadi And Ram Prasad

Roja Beaten Hyper Aadi And Ram Prasad

ఏంది బే, పోబే అంటూ రామ్ ప్రసాద్ పరువుతీసేసింది రోజా. ఏంటి మేడం ఈ అన్యాయం అంటూ నరేష్ ముందుకు రావడంతో.. ఎత్తి అవతల పారేసింది.తమను రోజా కొట్టిందంటూ అందరూ కలిసి డౌన్ డౌన్ అనడం, నిరాహార దీక్ష పేరిట స్కిట్ చేయడం, ఆ తరువాత జాఫర్ ఎంట్రీ ఇవ్వడం ఇలా స్కిట్ అంతా కూడా నవ్వులు పూశాయి. మొత్తానికి రోజా మాత్రం తన రౌడీయిజాన్ని ఇలా స్కిట్ల రూపంలో చూపించేసినట్టుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది