Home » Entertainment » Roja Counters To Chalaki Chanti In Jabardasth
Entertainment

Roja : నాకు అలాంటివేం లేవన్న రోజా.. మొత్తానికి చలాకి చంటి గాలి తీసేసిందిగా

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 17, 2022, 10:00 pm
Advertisement

Roja : జబర్దస్త్ షో అంటే.. ఆర్టిస్ట్‌లు, టీం లీడర్లు వేసే పంచ్‌లు ఫేమస్ అవుతుంటాయి. అయితే ఒక్కోసారి రోజా ముందు టీం లీడర్లు కూడా వెలవెలబోతారు. టీం లీడర్లు ఎంతోకష్టపడి రాసుకునే పంచ్‌లను రోజా ఇట్టే పసిగడుతుంటుంది. వారు స్టేజ్ మీద పంచ్‌లు వేసే కంటే ముందే.. రోజా వేసేస్తుంటుంది. అలా టీం లీడర్ల గాలి తీసేస్తుంటుంది.

Advertisement

ఒక్కోసారి టీం లీడర్లే రోజాకు దండం పెడతారు. మమ్మల్ని వదిలేయండి మేడం.. మేం రాసుకున్నదే ఒక్క పంచ్ అది కూడా మీరే చెప్పేస్తే ఎలా అని వేడుకుంటూ ఉంటారు. అయితే రోజా దెబ్బకు బలి కాని టీం లీడర్లు ఎవ్వరూ ఉండరు. సుధీర్, ఆది వంటి వారిని అయితే రోజా దారుణంగా ఆడుకుంటుంది.తాజాగా చలాకి చంటి టీం పరువు మొత్తం తీసేసింది.

Roja Counters To Chalaki Chanti In Jabardasth

Advertisement

Roja : చంటికి గాలితీసిన రోజా..

చలాకి చంటి టీం ఓ పంచ్ రాసుకున్నట్టుంది. దాన్ని రోజా ముందుగానే కనిపెట్టింది. అలా వారి కంటే ముందే రోజా చెప్పింది. అయినా సరే మళ్లీ డైలాగ్ చెప్పండి.. ఈ రోజు మనం ఆ పంచ్ చెప్పాల్సిందే అన్నట్టుగా చంటి ఆ సీన్‌ను రిపీట్ చేస్తుంటాడు. అయినా కూడా పదే పదే రోజా ఆ పంచ్‌ను వారి కంటే ముందే చెబుతూ ఉంటుంది. నాకు మొహమాటమేం లేదు.. ఎన్ని సార్లు అయినా చెబుతాను అంటూ రోజా కౌంటర్ వేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి