Jabardasth Faima : మాస్ మహారాణి ఫైమా రేంజ్ మారిందంతే.. రోజా కూడా ఫిదా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Faima : మాస్ మహారాణి ఫైమా రేంజ్ మారిందంతే.. రోజా కూడా ఫిదా

Jabardasth Faima : ఫైమా పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఒకప్పుడు ఎలా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఇప్పుడు ఎక్కడి వరకు చేరింది. ఇదే విజయం అంటే. ఆమె కష్టాలకు తగ్గ ప్రతిఫలం దొరికింది. ఇప్పుడు ఫైమా బుల్లితెరపై ఓ బ్రాండ్. పటాస్ షోలో సైడ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చిన ఫైమా ఇప్పుడు జబర్దస్త్ షోకు ప్రాణంగా నిలుస్తోంది. ఆమె చేసేది ఒక్కోసారి అతిగా అనిపించినా కూడా అందులోనూ ఓ మార్క్ వేసేస్తోంది.ఒకప్పుడు ఆమెను ఏ రూపంలో ఉందని ఎగతాళి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 April 2022,8:30 pm

Jabardasth Faima : ఫైమా పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఒకప్పుడు ఎలా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఇప్పుడు ఎక్కడి వరకు చేరింది. ఇదే విజయం అంటే. ఆమె కష్టాలకు తగ్గ ప్రతిఫలం దొరికింది. ఇప్పుడు ఫైమా బుల్లితెరపై ఓ బ్రాండ్. పటాస్ షోలో సైడ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చిన ఫైమా ఇప్పుడు జబర్దస్త్ షోకు ప్రాణంగా నిలుస్తోంది. ఆమె చేసేది ఒక్కోసారి అతిగా అనిపించినా కూడా అందులోనూ ఓ మార్క్ వేసేస్తోంది.ఒకప్పుడు ఆమెను ఏ రూపంలో ఉందని ఎగతాళి చేశారో ఇప్పుడు అదే రూపం ఆమెకు కలిసి వచ్చింది.

బక్కగా ఉందని, ఎండిపోయి ఉందని, నల్లగా ఉందంటూ, జుట్టు కూడా లేదని ఇలా ఎన్నెన్నో రకాలుగా సెటైర్లు వేశారు. కానీ ఇప్పుడు అదే ఫైమా జబర్దస్త్ షోలో టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయింది. ఫైమా లేకపోతే స్కిట్లే లేదన్నట్టుగా మారిపోయింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ ఇలా అన్ని షోల్లోనూ ఫైమా సందడి చేసింది.తాజాగా చేసిన ఓ స్కిట్‌లో ఫైమా దుమ్ములేపేసింది. పక్కింట్లో రాక్షసి లాంటి ఆడది అద్దెకు దిగితే ఎలా ఉంటుందో ఫైమా చూపించింది.

Roja Impresses Jabardasth Faima Excellent Performance in Latest Skit

Roja Impresses Jabardasth Faima Excellent Performance in Latest Skit

ఇందులో వర్ష, ఇమాన్యుయేల్‌ను ఫైమా ఆడుకుంది. ఆడోడా? మొగొడివి కాదా? అంటూ ఇమాన్యుయేల్‌ను ఓ ఆట ఆడుకుంది ఫైమా. అయితే ఫైమా దెబ్బకు భాస్కర్, వర్ష, ఇమాన్యుయెల్‌‌కు చుక్కలు కనిపించి ఉంటాయి.ఈ పర్ఫామెన్స్‌ను చూసి రోజా ఫిదా అయింది. ఫైమాకు బిరుదులు కూడా ఇచ్చేస్తోంది. మాస్ మహారాణి, వన్ ఉమెన్ షో అంటూ ఫైమాను ఆకాశానికెత్తేసింది. ఇక నెటిజన్లు కూడా అదే మాటలు అంటున్నారు. ఫైమా ఉన్నంత వరకు బుల్లెట్ భాస్కర్ టీంకు ఏ ఢోకా లేదని అంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది