RK Roja vs YS Jagan : డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RK Roja vs YS Jagan : డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు..?

 Authored By siddhu | The Telugu News | Updated on :23 March 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  RK Roja vs YS Jagan : డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు..?

RK Roja vs YS Jagan : రోజా ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నగరి నియోజకవర్గంలో నేషనల్ హైవే నిర్మాణం కోసం సుమారు 600 ఏళ్ల నాటి పురాతన ఆలయాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతుండటంతో, దానిని ఆపాలని కోరుతూ ఆమె కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అయితే ఈ పర్యటన వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందనే చర్చ మొదలైంది. ఒక పక్క తిరుమల లడ్డూ నెయ్యి వివాదంతో జగన్ మోహన్ రెడ్డి ఇరకాటంలో ఉన్న సమయంలో, రోజా హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తన సొంత నియోజకవర్గ సమస్యల సాకుతో ఢిల్లీలో అడుగుపెట్టిన రోజా, అక్కడ తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ కి తెలియకుండా ఏవైనా కొత్త దారులు వెతుక్కుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

RK Roja vs YS Jagan డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు

RK Roja vs YS Jagan : డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు..?

పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యత తగ్గడం వల్ల రోజా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ ఆలయ వివాదాన్ని అస్త్రంగా చేసుకుని ఆమె నేరుగా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి వంటి జగన్ నమ్మకస్తులను వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా ఇది పార్టీ పనిగానే కనిపిస్తున్నా, లోలోపల మాత్రం ఆమె తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. జగన్ ప్రస్తుతం హిందూ వ్యతిరేక విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో, రోజా మాత్రం తనే స్వయంగా ఒక హిందూ దేవాలయాన్ని కాపాడే రక్షకురాలిగా ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొందాలని చూడటం పార్టీకి ఒక రకమైన ఇబ్బందికర పరిణామమే.

ఈ పర్యటన ద్వారా రోజా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత ఆమె మాట్లాడుతూ, ఆలయాన్ని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కేంద్రానికి అభ్యంతరం లేదని చెప్పడం ద్వారా బంతిని చంద్రబాబు కోర్టులోకి నెట్టారు. అయితే ఇదే సమయంలో జగన్ కి ఏమాత్రం లీడ్ ఇవ్వకుండా మొత్తం క్రెడిట్ అంతా తానే తీసుకోవాలని రోజా ప్రయత్నించడం వెన్నుపోటు లాంటిదే అని కొందరు వైసిపి కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన వ్యక్తిగత హైప్ కోసం ఇలాంటి పర్యటనలు చేయడం జగన్ నాయకత్వానికి విరుద్ధంగా వ్యవహరించడమే అవుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఢిల్లీలో అడుగుపెట్టిన రోజా వేసిన అడుగులు జగన్ కి మేలు చేస్తాయా లేక ఆమె సొంత దారి చూసుకుంటుందా అనేది వేచి చూడాలి.

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది