Hyper Aadi : హైపర్ ఆదిని కించపరిచిన సుమ.. పగలబడి నవ్వేసిన రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : హైపర్ ఆదిని కించపరిచిన సుమ.. పగలబడి నవ్వేసిన రోజా

 Authored By prabhas | The Telugu News | Updated on :27 March 2022,6:30 pm

Hyper Aadi : హైపర్ ఆది వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందరి మీద బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తుంటాడు. వర్ష గొంతు మీద, లేడీ గెటప్పు అంటూ సెటైర్లు, రోహిణి భారీ కాయంపై, ఫైమా లుక్కుపై ఇలా అందరి మీద కౌంటర్లు వేస్తుంటాడు. బాడీ షేమింగ్ చేయడంపై ఆది ఏ మాత్రం వెనుకడుగు వేయడు. అలాంటి ఆది మీద సుమ అదిరిపోయే పంచ్ వేసింది.

అంగరంగ వైభవంగా అంటూ ఈ ఉగాదికి ఈటీవీలో ఈవెంట్ రాబోతోంది. అందులో సుమ, రాజశేఖర్ ఫ్యామిలీ ఇలా అందరూ గెస్టులుగా వచ్చేశారు. అయితే ఇందులో సుమ తన జయమ్మ పంచాయితీని కూడా ప్రమోట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే కుండలు తయారు చేయిస్తాను అంటూ సుమ చెబుతుంది. ఈ క్రమంలోనే ఆది మీద కౌంటర్లు వేసింది.

Roja Laughs At Suma Satires on Hyper Aadi

Roja Laughs At Suma Satires on Hyper Aadi

Hyper Aadi : ఆది మీద అదిరే పంచ్..

మాకు ఓ కుండ కావాలి అని ఆది అడుగుతాడు. ఆల్రెడీ మీ దగ్గరే ఓ కుండ ఉంది కదా? అని సుమ సెటైర్ వేస్తుంది. దీంతో ఆది పొట్టను జూమ్ చేసి చూపిస్తారు. దీంతో రోజా తెగ నవ్వేస్తుంది. ఆ నవ్వుతో ఆదికి, రాం ప్రసాద్‌కు బాగానే కాలినట్టుంది. మరీ మాకు కాలేలా అలా నవ్వకండి మేడం అని రాం ప్రసాద్ అంటాడు. దీంతో రోజా మరింత రెచ్చిపోతుంది. పగలబడి నవ్వేస్తుంది. ఆ నవ్వుతో ఆది, రాం ప్రసాద్ మొహం మాడిపోతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి