Roja : రోజాపై వేటు.. ఇంద్ర‌జ‌కు ఓటు.. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో మార్పులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : రోజాపై వేటు.. ఇంద్ర‌జ‌కు ఓటు.. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో మార్పులు

Roja : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో జ‌బ‌ర్ధ‌స్త్. నటుడు నాగబాబు తో పాటు ఏళ్ల తరబడి ఆ షో జడ్జిగా వ్యవహరించారు రోజా . ఏదో షోలో కూర్చున్నామా? టీమ్స్ కి మార్కులు వేశామా? అన్నట్లు కాకుండా రోజా తన ప్రత్యేకత చాటుకున్నారు. కమెడియన్స్ పంచ్ లకు కౌంటర్లు వేయడంలో రోజా దిట్ట. ఆమె తన మార్కు పంచ్ లతో షోలో జోష్ నింపుతూ ఉంటారు. ఇక రెండేళ్ల క్రితం నాగబాబు షో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :6 April 2022,8:30 pm

Roja : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో జ‌బ‌ర్ధ‌స్త్. నటుడు నాగబాబు తో పాటు ఏళ్ల తరబడి ఆ షో జడ్జిగా వ్యవహరించారు రోజా . ఏదో షోలో కూర్చున్నామా? టీమ్స్ కి మార్కులు వేశామా? అన్నట్లు కాకుండా రోజా తన ప్రత్యేకత చాటుకున్నారు. కమెడియన్స్ పంచ్ లకు కౌంటర్లు వేయడంలో రోజా దిట్ట. ఆమె తన మార్కు పంచ్ లతో షోలో జోష్ నింపుతూ ఉంటారు. ఇక రెండేళ్ల క్రితం నాగబాబు షో నుండి తప్పుకున్నా రోజా మాత్రం కొనసాగుతున్నారు. జబర్దస్త్ షోతో ఏకంగా 9 ఏళ్ల అనుబంధం ఆమెది. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇతర షోలు, స్పెషల్ ఈవెంట్స్ లో రోజా సందడి చేస్తూ ఉంటారు. ఇటీవల రోజాకు సర్జరీ జరిగింది.

దానితో కొన్ని వారాలు జబర్దస్త్ షోతో పాటు బుల్లితెర ఈవెంట్స్ కి దూరమయ్యారు.అయితే తాజాగా రోజా జ‌బర్దస్త్ నుండి వైదొలగనున్నారట. ఆమెకు మంత్రి పదవి వరించడమే ఇందుకు కారణం అంటున్నారు. ఏపీ సీఎం జగన్ మంత్రివర్గం పునఃవ్యవస్థీకరణ చేస్తున్న నేపథ్యంలో … ఎప్పటి నుండో ఆశలు పెట్టుకున్న రోజాకు మంత్రి పదవి ఖాయం అంటున్నారు. ఈ మేరకు రోజాకు హామీ కూడా ఇవ్వడం జరిగిందట. అయితే తాజాగా వ‌దిలిన ప్రోమో నేప‌థ్యంలో రోజా స్థానంలో ఇంద్ర‌జ వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. అయితే రోజా మంత్రిగా మరిన్ని బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది.

roja out from jabardath

roja out from jabardath

Roja : పాపం రోజా ఔట్

అందుకే జబర్దస్త్ షో నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.మరోవైపు రోజా బుల్లితెర షోలపై ఎప్పటి నుండో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విపక్షాలతో పాటు ఆమె యాంటీ ఫ్యాన్స్ ఈ కోణం నుండి ఆమెను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి పదవిలో హుందాగా వ్యవహరించాలంటే ఈ షోలకు దూరంగా ఉండడమే బెటర్ అని రోజా భావిస్తున్నారట.అందుక‌నే రోజా బుల్లితెర‌కు దూరంగా ఉంటుంద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుందో…!

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది