
roj daughter compete with hermother
Roja : సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రోజా.. ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటుతోంది. ప్రజెంట్ ఓ వైపు బుల్లితెరపైన సందడి చేస్తూనే మరో వైపున రాజకీయాల్లో కొనసాగుతోంది. కాగా, ఓ విషయంలో ఆమె కూతురు ఆమెకే పోటీనిస్తుందట.వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న రోజా.. పేద పిల్లలను తన సొంత డబ్బులతో చదవిస్తుంది. నగరి ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలకు రోజా సేవలందిస్తున్నది. కాగా, తల్లిబాటలోనే తనయ అన్షుమాలిక కొనసాగుతున్నది.
చిన్న వయసులోనే అన్షుమాలిక ఓ ఎన్టీవో ద్వారా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుంది. తన తనయ ఇలా చిన్న వయసులోనే సొసైటీ కోసం ఆలోచించడం చూసి రోజా గర్వపడుతున్నది. ఇంత చిన్న వయసులోనే తన కూతురికి అటువంటి ఆలోచన రావడం గొప్ప విషయమని పేర్కొంది రోజా. ఇకపోతే రోజా తన కూతురు గురించి మీడియాతో మాట్లాడుతూ తన కూతురుకు చదువు అంటే చాలా ఇష్టమని, నిరంతరం పుస్తకాలు చదువుతూనే ఆమె ఉంటుందని తెలిపింది.
roj daughter compete with hermother
ఈ విషయం తెలుసుకుని చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి తగ్గ తనయ అన్షు మాలిక అని అంటున్నారు. సొసైటీకి సేవ చేసే విషయంలో తల్లి రోజాను అన్షుమాలిక మించి పోతుందని పొగిడేస్తున్నారు. ఇకపోతే రోజా వైసీపీ నాయకురాలిగా చెరగని ముద్ర వేసుకున్నదని చెప్పొచ్చు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారిలో రోజా ఒకరు. కాగా, ఈమె తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ఏర్పరుచుకుందని పలువురు సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రోజా పొలిటికల్ ఎంట్రీ టీడీపీతో జరిగినప్పటికీ ఆ తర్వాత కాలంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఆమె వైసీపీలో చేరింది. వైసీపీ తరఫున బలమైన వాదనలను వినిపిస్తూ టీడీపీ వాదనలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా రోజా పేరు తెచ్చుకుంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా రోజా కొనసాగుతోంది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.