Roshan : రామ్ చరణ్ ఎన్టీఆర్ లని మించిపోయేలా ఉన్నాడు శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా ల లిస్ట్ చూస్తే వామ్మో అంటారు !

Authored By Sam C | The Telugu News | Published on: January 22, 2022, 4:40 pm

Roshan : సినీ ఇండ‌స్ట్రీలో వార‌సుల హంగామా కొత్తేమి కాదు. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్స్ త‌న‌యులు తెగ సంద‌డి చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ కూడా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నాడు. నిర్మల కాన్వెంట్ సినిమాతో టీనేజ్‏లోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రోష‌న్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇటీవల పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. హీరోగా రోషన్‏కు మంచి సక్సెస్ అందించింది.

ఇప్పుడు రోష‌న్‌కి పెద్ద బ్యాన‌ర్స్ నుండి క్రేజీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇటీవల `జాతిరత్నాలు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైజయంతీ మూవీస్ ఇదే ఫార్ములాతో మరో చిన్న చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయిపోతోంది. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ వర్క్ పూర్తయిందని త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయ‌ని టాక్.

roshan acts in vyjayanthi movies and sitara entertainments

roshan acts in vyjayanthi movies and sitara entertainments

Roshan : కుర్ర హీరో కేక పెట్టిస్తున్నాడుగా..!

రోష‌న్.. సితార బ్యానర్లో రోషన్ మరో మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే వివరాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం.కాగా, రోష‌న్ చివ‌రిగా `పెళ్లి సంద‌డి`తో తెర‌పైకొచ్చాడు రోష‌న్‌. ఆ సినిమా రివ్యూల ప‌రంగా అటూ ఇటూ ఊగినా, వ‌సూళ్ల ప‌రంగా మంచి లాభాలు అందుకుంది. ద‌స‌రా సీజ‌న్‌లో విడుద‌ల కావ‌డం పెళ్లి సంద‌డికి క‌లిసొచ్చింది. రోష‌న్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండ‌డం, డాన్సులు బాగా చేయ‌డంతో.. త‌న‌కు ఆ సినిమా బాగా హెల్ప్ అయ్యింది.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp