roshan acts in vyjayanthi movies and sitara entertainments
Roshan : సినీ ఇండస్ట్రీలో వారసుల హంగామా కొత్తేమి కాదు. ఇప్పటికే పలువురు స్టార్స్ తనయులు తెగ సందడి చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. నిర్మల కాన్వెంట్ సినిమాతో టీనేజ్లోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇటీవల పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. హీరోగా రోషన్‌కు మంచి సక్సెస్ అందించింది.
ఇప్పుడు రోషన్‌కి పెద్ద బ్యానర్స్ నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల `జాతిరత్నాలు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైజయంతీ మూవీస్ ఇదే ఫార్ములాతో మరో చిన్న చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయిపోతోంది. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ వర్క్ పూర్తయిందని త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.
roshan acts in vyjayanthi movies and sitara entertainments
రోషన్.. సితార బ్యానర్లో రోషన్ మరో మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే వివరాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం.కాగా, రోషన్ చివరిగా `పెళ్లి సందడి`తో తెరపైకొచ్చాడు రోషన్. ఆ సినిమా రివ్యూల పరంగా అటూ ఇటూ ఊగినా, వసూళ్ల పరంగా మంచి లాభాలు అందుకుంది. దసరా సీజన్‌లో విడుదల కావడం పెళ్లి సందడికి కలిసొచ్చింది. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండడం, డాన్సులు బాగా చేయడంతో.. తనకు ఆ సినిమా బాగా హెల్ప్ అయ్యింది.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.