New Feature phones : 2022 సంవత్సరం తొలి భాగంలో కొత్త మొబైల్ ఫోన్స్ విడుదలయ్యాయి. ప్రముఖ అంతర్జాతీయ మోడళ్లు కూడా ఉన్నాయి. సరసమైన ధరలకు ఈ స్మార్ట్ ఫోన్స్‌ను ఆయా కంపెనీలు విడుదల చేయాయి. వీటిలో వన్‌ప్లస్, సామ్‌సంగ్, షియోమీ, రియల్‌మీ.. ఇలా టాప్ కంపెనీల నుంచి ఈ నెలలో ఇప్పటి వరకు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి. అధునాతన ప్రాసెసర్లు, కొత్త టెక్నాలజీలతో పాటు మరెన్నో ప్రత్యేకతలతో ఫోన్లు విడుదలయ్యాయి. బడ్జెట్ రేంజ్‌లో ఇప్పటివరకు లాంచ్ అయిన మొబైల్ ఫోన్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..వన్‌ప్లస్ 9 ఆర్‌టీ 5జీ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్‌లో రీసెంట్‌గా లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రూ.40వేలలోపు ధరతో ఈ ఫోన్ వచ్చింది. అధునాతన ఫీచర్లు ఉన్న 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది.
అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు వన్‌ప్లస్ 9ఆర్‌టీ వెనుక ఉన్నాయి. అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. దీని తర్వాత షియోమీ 11ఐ సిరీస్జ.. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో 15నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యే షియోమీ 11ఐ హైపర్ చార్జ్ మొబైల్ ఈ నెలలోనే విడుదలైంది. దీంతో పాటు షియోమీ 11ఐ మొబైల్ కూడా లాంచ్ అయింది.షియోమీ 11టీ ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో షియోమీ 11టీ ప్రో 5జీ మొబైల్ గత వారం భారత్‌లో విడుదలైంది. ఆ తర్వాత మోటో జీ71 5జీ రూ.19వేలలోపు 5జీ కనెక్టివిటీ, అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది మోటో జీ71 5జీ. రూ.20వేలలోపు బెస్ట్ ఫోన్లలో ఒకటిగా ఈ మొబైల్ ఉంది. వివో వీ23, వివో వీ23 ప్రో రంగులు మారే బ్యాక్ ప్యానెళ్లు, ఆకర్షణీయమైన కెమెరాలతో వివో వీ23 సిరీస్ ఈ నెలలో విడుదలైంది.
ఈ ఫోన్లలో ముందు 50మెగాపిక్సెల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. రియల్‌మీ 9ఐ బడ్జెట్ రేంజ్‌లో ఈ వారంలోనే రియల్‌మీ 9ఐ మొబైల్ విడుదలైంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ రూ.13,999గా ఉంది. వన్‌ప్లస్ 10 ప్రో వన్‌ప్లస్ అత్యంత శక్తిమంతమైన వన్‌ప్లస్ 10ప్రో ఈ నెలలోనే చైనాలో విడుదలైంది. అధునాతన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ సహా అన్నీ విభాగాల్లో అదిరిపోయేలా ఈ ఫోన్ ఉంది. త్వరలోనే ఈ మొబైల్ భారత్‌కు రానుంది. రియల్‌మీ జీటీ2 ప్రో రియల్‌మీ తొలి ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ రియల్‌మీ జీటీ 2 ప్రో చైనాలో ఇటీవలే లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పాటు అనేక ప్రత్యేకతలో ఈ ఫోన్ వచ్చింది. డిజైన్ నుంచి డిస్‌ప్లే, కెమెరాలు ఇలా ప్రతీ విభాగంలో స్పెషాలిటీలు ఉన్నాయి. టెక్నో పోవా నియో 6000ఎంఏహెచ్ బ్యాటరీ, భారీ డిస్‌ప్లేతో రూ.12,999 ధరకే ఈ మొబైల్ భారత్‌లో విడుదలైంది.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.