RRR మళ్లీ వస్తుంది.. బిహైండ్ & బియాండ్..!
RRR : చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ రెండేళ్ల క్రితం రిలీజై సెన్సేషనల్ హిట్ అయ్యింది. సినిమా లో చరణ్, తారక్ ఇద్దరు వారి వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఇద్దరు హీరోలు అది కూడా మెగా నందమూరి ఫ్యామిలీ హీరోస్ కలిసి ఒక సినిమా చేయడం అంటే చాలా పెద్ద విషయం. కానీ జక్కన్న దాన్ని బాగా బ్యాలెన్స్ చేశాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్నట్టుగానే అదరగొట్టేసింది. బాక్సాఫీస్ దగ్గర 1100 కోట్ల రూపాయలతో షేక్ ఆడించింది. RRR తో రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే RRR సినిమా బిహైండ్ & బియాండ్ అంటూ డాక్యుమెంటరీ వస్తుంది. దీనికి సంబందించిన అప్డేట్ వచ్చింది. ఈ డాక్యుమెంటరీ గురించి RRR మూవీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అప్డేట్ వచ్చింది…
RRR డిసెంబర్ లో ఈ డాక్యుమెంటరీ రిలీజ్..
డిసెంబర్ లో ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అని ప్రకటించారు. RRR ఆఫ్ స్క్రీన్ మీద జరిగిన విషయాలు. హీరోల మధ్య ఆసక్తికరమైన చర్చ. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది లాంటి విషయాలు ఈ డాక్యుమెంటరీలో ఉండే ఛాన్స్ ఉంటుంది. RRR సినిమా వెండితెర మీదే కాదు డిజిటల్ రిలీజ్ పై కూడా సత్తా చాటింది.
ఇక ఆర్.ఆ.ఆర్ డాక్యుమెంటరీ ఎలా ఉంటుందో చూడాలి. రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మాత్రం ఈ డాక్యుమెంటరీ అదిరిపోతుంది. ఐతే ఆర్.ఆర్.ఆర్ సినిమా డిస్నీ హాట్ స్టార్ రైట్స్ కొనేసింది. ఈ డాక్యుమెంటరీ కూడా దానికే ఇచ్చారా లేదా అన్నది చూడాలి. RRR బిహైండ్ స్క్రీన్, ఇంకా బియాండ్ సీన్స్ ఏం జరిగింది.. అసలు ఈ కాంబో ఆలోచన రాజమౌళికి ఎలా వచ్చింది. ఎలా మొదలు పెట్టారు ఎలా ముగించారు. సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. RRR బిహైండ్, బియాండ్ డాక్యుమెంటరీ ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. RRR Behind & Beyond Documentary Announcement , RRR Behind & Beyond Documentary Announcement , Rajamouli, NTR, Ram Charan