rrr he has more responsibility than rajamouli
RRR : ఆర్.ఆర్.ఆర్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్, ఓలివియా మోరీస్, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ సహా పలువురు బాలీవుడ్..హాలీవుడ్ నటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
RRR content leak chances are there…Rajamouli is in tension
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తో సహా 8 భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13 న భారీ స్థాయిలో రిలీజ్ కానుండగా సరిగ్గా నెల రోజుల ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమా కి సంబంధించి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లోనే ఆర్.ఆర్.ఆర్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా .. ఒకవైపు నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నాడట రాజమౌళి.
అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాకి సంబంధించి ఒక పెద్ద సమస్య వచ్చిందట. ఈ సమస్య రాజమౌళి ని బాగా టెన్షన్ పెడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయట. గ్రాఫిక్స్ వర్క్ డిపార్ట్మెంట్ లో చాలా మంది టెక్నీషియన్లు విదేశీయులు కావడం వల్ల ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ కి వారి కొరత ఎక్కువైందని సమాచారం. ఆన్ లైన్ లో వర్క్ చేద్దామంటే కంటెంట్ లీక్ అయ్యే సమస్యలు ఉండటంతో రిస్క్ చేయలేక అందుబాటులో ఉన్న టెక్నీషియన్లతోనే వర్క్ చేయిస్తున్నారట. ఈ కారణంగా ఆర్.ఆర్.ఆర్ గ్రాఫిక్స్ వర్క్ బాగా డిలే అవుతుందని తెలుస్తోంది.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.