rrr he has more responsibility than rajamouli
RRR Movie : ఆర్ఆర్ఆర్ ఇప్పుడు దేశం మొత్తం లో హాట్ టాపిక్. అందుకు కారణం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. కొమరం భీం పాత్రలే. ఈ రెండు అత్యంత శక్తి వంతమైన పాత్రలని దర్శక ధీరుడు రాజమౌళి వెండి తెర మీదకి ఏ విధంగా తీసుకు రాబోతున్నాడు. భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అని అందరి చూపు ఈ సినిమా మీదే ఉంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా దాదాపు 400 కోట్ల తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి భీం ఫర్ రామరాజు – రామరాజు ఫర్ భీం టీజర్స్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో రాజమౌళి జస్ట్ శాంపిల్ చూపించాడు. అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు వందేళ్ళ పాటు చెప్పుకునేలా ఆర్ఆర్ఆర్ ని తీసుకు రాబోతున్నట్టు ఈ రెండు టీజర్స్ తో హింట్ ఇచ్చాడు. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ లో రాం చరణ్ – ఎన్.టి.ఆర్ పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఈ క్లైమాక్స్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ మీద అంచనాలు ఏ ఒక్కరి ఊహకి అందడం లేదు.
RRR : రాజమౌళి కంటే ఆర్ఆర్ఆర్ సినిమా బాధ్యత ఎక్కువగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మీదే..!
అయితే రాజమౌళి కంటే ఆర్ఆర్ఆర్ సినిమా బాధ్యత ఎక్కువగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మీదే అదనంగా ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాహుబలి రెండు భాగాలకి కీరవాణి అందించిన సాంగ్స్ .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని ఎంతగా పెంచాయో అందరికీ తెలిసిందే. బాహుబలి సక్సస్ లో క్రెడిట్ ఖచ్చితంగా కీరవాణి కి చెందుతుంది. అదే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మీద రెట్టింపు చేసిందని చెప్పుకుంటున్నారు. ఒకరకంగా ఆర్ఆర్ఆర్ కీరవాణి కి పెద్ద సవాల్ అంటున్నారు. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ విషయంలో కీరవాణి ఎలాంటి ప్రశంసలు అందుకుంటారో. కాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుంచి ఈ నెల 26 భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.