RRR Movie : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ హంగామా నడుస్తుంది. సినీ అభిమానులు, మెగా, నందమూరి ఫ్యాన్స్ గత నాలుగేళ్లుగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా నిన్నటి నుంచి సినీ థియేటర్స్ వద్ద అభిమానులు ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. తమ తమ అభిమాన హీరోల కటౌట్స్ పెట్టి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. బెనిఫిట్ షో టికెట్స్ ను పోటీపడి మరీ భారీధరకు కొనుగోలు చేశారు. పాజిటివ్ టాక్ తో ఆర్ఆర్ఆర్ మూవీ అదిరింది అని అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ లో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు.అంబేద్కర్ నగర్ కు చెందిన ఓబిలేసు రిలీజ్ సందర్భంగా గత రాత్రి నుంచి సినిమా థియేటర్ వద్ద ఓబిలేసు సందడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇతనికి గతంలో హార్ట్ అటాక్ రావడంతో వైద్యులు స్టంట్ వేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షో కి తెల్లవారుజామున సినిమా థియేటర్ కు వచ్చిన ఓబులేశు… ప్రదర్శన సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కన్నుమూసినట్టు తెలిపారు. అభిమాని మృతిపై తోటి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ ప్రదర్శిత థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. తొలి షో చూసాక అభిమానుల కేరింతలు కొట్టారు. సినిమా హిట్ టాక్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటు సందడి చేస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు ఎదుట కొబ్బరికాయలు కొడుతూ.. డబ్బులు, డ్యాన్సులతో సంబరాలు చేస్తున్నారు అభిమానులు.ఆర్ఆర్ఆర్ మూవీలో మన్యం దొర, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గెట్ లో కనిపించిన రామ్ చరణ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మెగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని డిఫరెంట్ గా చాటుకున్నారు. 100మందికి పైగా యువకులు అల్లూరి సీతారామరాజు గెటప్ ను ధరించారు. అంతేకాదు.. అదే గెటప్ లో భారీగా బైక్ ర్యాలీ చేశారు. జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ.. భాగ్యనగర వీధుల్లో చక్కర్లు కొట్టారు.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.