RRR Movie : ఆర్ఆర్ఆర్ RRR Movie .. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. తాజాగా రాజమౌళిపై ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు వీరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. తెలుగు సినిమా సత్తా ఏంతటిదో బాహుబలి సినిమాలతో రాజమౌళి ప్రపంచ పటం ముందు పెట్టి చూపించాడు.
రాజమౌళి కి సినిమా విషయంలో ఉండే ఆలోచనా విధానం, ధోరణి తెలుగు చిత్ర పరిశ్రమలో మరే దర్శకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 తీసినప్పుడు బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమా చేస్తాడని తెలుగు ఇండస్ట్రీకి, హీరోలకు ఇంత గౌరవాన్ని తీసుకువస్తారని ఏ ఒక్కరు ఊహించి ఉండరు. సింహాద్రి సినిమా నుంచి రాజమౌళి ఒక్కో సినిమా ఒక్కో మైల్ స్టోన్‌లా తీస్తూ వస్తున్నాడు. ఆయనతో పని చేయాలని ఇండస్ట్రీలో ఉన్న 24 విభాగాలకి చెందిన టెక్నీషియన్స్, హీరో, హీరోయిన్స్, పరభాషా నటులు ఆశపడుతుంటారు.
ముఖ్యంగా రాజమౌళి తీసిన ప్రతీ సినిమాకి ఆయన ప్రతిబింబం కనిపిస్తుంది. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఫైట్ మాస్టర్స్, కెమెరా మ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా ఎవరున్నా ఎంత కష్టపడినా..చివరికి క్రెడిట్ వచ్చేది మాత్రం రాజమౌళికే. ఇది చాలా మంది అభిప్రాయం కూడా. ఇదే విషయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ తాజా ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
రాజమౌళికి ప్రతీ సీన్ విషయంలో పక్కా క్లారిటీ ఉంటుందని అన్న వీరు..ఆయన సినిమాలకి ఫైట్స్ కంపోజ్ చేసినా మాకు క్రెడిట్ రాదు. ఎందుకంటే ఆయన ఒక్కో షాట్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు..చాలా కష్టపడతారు. ఇది పాజిటివ్ గా చెప్తున్న విషయం. అని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ కి పనిచేయాల్సి ఉండగా డేట్స్ సర్ధుబాటు కాలేక చేయలేకపోయామని చెప్పిన రామ్ లక్ష్మణ్..రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాకి మంచి ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం ఇచ్చారని ..ఈ రోజు మన తెలుగు సినిమా సత్తా ఇంతటిది అని చెప్పిన రాజమౌళి గారి కృతజ్ఞతలని పేర్కొన్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.