RRR Movie : రెండు రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టించిన ఆర్ఆర్ఆర్.. ఫ‌స్ట్ రిలీజ్ డేట్‌కి రావ‌డం చాలా క‌ష్టం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR Movie : రెండు రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టించిన ఆర్ఆర్ఆర్.. ఫ‌స్ట్ రిలీజ్ డేట్‌కి రావ‌డం చాలా క‌ష్టం!

 Authored By sandeep | The Telugu News | Updated on :27 January 2022,4:00 pm

RRR Movie : బాహుబ‌లితో సంచ‌ల‌నాలు సృష్టించిన రాజ‌మౌళి రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేసినట్టుగా టాక్. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‏గా చేసేందుకు సిద్ధమయ్యారు. హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఎక్కువగానే చేశాడు జక్కన్న. అయితే ఇందుకోసం రాజమౌళి పెట్టిన ఖర్చు కోట్ల‌లో ఉంద‌ని స‌మాచారం.

క‌రోనా వ‌ల‌న సినిమా వాయిదా ప‌డ‌గా, ఈ మూవీ మ‌ళ్లీ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో మార్చి 18 లేదా ఏప్రిల్ 28నే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీం ఫిక్స్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చిలో కరోనా పరిస్థితి చక్కబడుతుందా లేదా.. ఏప్రిల్ లోనే రిలీజ్ కు వెళ్తారా అంటూ అప్పటి నుండే ఎన్నో చర్చలు నడుస్తుండగా.. ఇప్పుడు మార్చిలో ఈ సినిమా లేనట్లే అనేలా ఓ క్లారిటీ వస్తుంది. దానికి బలమైన ఓ కారణం కూడా ఉంది.క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

RRR movie Releasing on April

RRR movie Releasing on April

RRR Movie : ఇంకెన్నిసార్లు వాయిదా ప‌డుతుందో..

అయితే ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం జేమ్స్ మార్చి 17న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా.. జేమ్స్ విడుదల తర్వాత వారం రోజుల పాటు రాష్ట్రంలో మరే సినిమా విడుదల చేయకూడదని.. పునీత్ కి నివాళిగా అక్కడి డిస్టిబ్యూటర్స్ నిర్ణయించుకున్నారు. అంటే.. ఆర్ఆర్ఆర్ మార్చి 18న విడుదల చేసినా కన్నడలో విడుదల కాలేదు. క‌న్న‌డ‌లోను ఆర్ఆర్ఆర్ సినిమాని భారీ ఎత్తున విడుద‌ల చేయాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్న నేప‌థ్యంలో సినిమాని మార్చిలో కాకుండా ఏప్రిల్‌లో విడుద‌ల చేసే ప్లాన్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది