RRR Movie : త్వరలోనే ఆర్ఆర్ఆర్ 2 సినిమా .. కానీ డైరెక్టర్ రాజమౌళి కాదు !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RRR Movie : త్వరలోనే ఆర్ఆర్ఆర్ 2 సినిమా .. కానీ డైరెక్టర్ రాజమౌళి కాదు !!

RRR Movie : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా మారారు. ఈ సినిమాలో ఇద్దరు కలిసి సొంత అన్నదమ్ముల కలిసిపోయి మరీ నటించారు. ఈ సినిమా హిట్ అవ్వడానికి వీరిద్దరు కూడా కారణం […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 July 2023,8:10 pm

RRR Movie : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా మారారు. ఈ సినిమాలో ఇద్దరు కలిసి సొంత అన్నదమ్ముల కలిసిపోయి మరీ నటించారు. ఈ సినిమా హిట్ అవ్వడానికి వీరిద్దరు కూడా కారణం అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరోసారి కలిసిన నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. ఓ ప్రముఖ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ఈ పాన్ హీరోలతో మరో సినిమా ఉంటుందని ప్రకటించారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని, ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ అని అన్నారు. అయితే ఈ సినిమాకి దర్శకుడుగా రాజమౌళి ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఈ సీక్వెల్ పై రాజమౌళి తాలూకు పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.

RRR movie sequel

RRR movie sequel

దీంతో దర్శకుడు ఎవరన్న విషయంపై నెటిజన్స్ లో సందేహం నెలకొంది. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తారా లేక రాజమౌళి తనయుడు చేస్తారా లేక వేరే ఎవరైనా దర్శకుడు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ మహాభారతం ‘ సినిమా ఎప్పుడు ఉంటుందో అనే విషయాన్ని కూడా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక మహాభారతం ఉంటుందని అన్నారు. ఏది ఏమైనా రాంచరణ్ , ఎన్టీఆర్ తో మరో మల్టీ స్టారర్ సినిమా అంటే ప్రేక్షకులలో ఉత్సాహం పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది