RRR Naatu Naatu Won Oscar : దర్శక ధీరుడు దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ : సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును పొందింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. మన తెలుగువారి సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఆస్కార్ అవార్డు అంత గొప్పదా వాళ్లు మన సినిమాలను గుర్తించడం గురించి అంత సంతోషించాలా. మన దగ్గర హాలీవుడ్ సినిమాలకు మించిన అద్భుతమైన కళాకాండలు లేవా,
వాళ్లు మన సినిమాలు గుర్తించి గుర్తింపు ఇవ్వటం ఏంటి అని వాదించే వాళ్లు కూడా ఉన్నారు.కానీ మన సినిమాలను ప్రపంచం ఎప్పుడు గుర్తించింది లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా వలనే ఇండియన్ సత్తా ఏంటో తెలుస్తుంది. దీనివలన మన సినిమాల మార్కెట్ పెరుగుతుంది. ఇండియన్ సినిమా గ్లోబల్ వైజ్ గా గుర్తింపు పొందుతుంది. ఇందుకు మనం సంతోషించాలి. ఇకపోతే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇండియన్ సినిమాల్లో ఇంతకు మించిన పాటలు లేవా, రాజమౌళికి ఆర్థిక బలం ఉండబట్టి ఆస్కార్ అవార్డు కోసం అమెరికాలో కోట్లు ఖర్చు చేస్తున్నాడని, కాబట్టి ఈ పాటకు ఆస్కార్ వచ్చింది, ఇలా అన్ని పాటలు ప్రమోట్ చేసుకోవడం కుదురుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే కోట్లు ఖర్చు చేస్తే ఆస్కార్ అవార్డు రాదు, అలా అయితే వందల కోట్ల బడ్జెట్ పెట్టుకొని అందరూ ఆస్కార్ అవార్డు కోసం ట్రై చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊహించని విధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడంతో మరి ముఖ్యంగా హాలీవుడ్లో నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అమెరికన్లు ఈ పాటకు డ్యాన్స్ వేయడం ఇవన్నీ చూసాకే రాజమౌళి టీం అంతర్జాతీయ వేడుకలకు ఆ పాటను తీసుకెళ్లడం చేశారు. ఆ క్రమంలో అవసరమైన చోట ప్రమోషన్ల కోసం ఖర్చు పెట్టారు. ఇలా చాలామంది ఆస్కార్ కోసం ప్రమోట్ చేస్తూ ఉంటారు. చేసిన వారందరికీ ఆస్కార్ అవార్డు అనేది రాదు అని విమర్శకులు తెలుసుకోవాలి.
Chiranjeevi Balakrishna : సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షో టైం…
Amla Juice : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తినడంతోపాటు మంచి జీవనశైలి ఉండాలి. ప్రస్తుత కాలంలో…
Tollywood Meeting : సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో నేడు సినీ పెద్దలు తెలంగాణ…
Ys Jagan : దివంగత నేత వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు ఏ స్థాయిలో చేరుకున్నాయో మనం చూశాం. వారి కుటుంబంలో…
Sweet Potatoes : స్వీట్ పొటాటో లో ఉండే పోషకాలు మరి ఎటువంటి దుంపల్లో కూడా ఉండవని పోషకాహార నిపుణులు…
Makar Sankranti : గ్రహాలకి రాజు అయిన సూర్య భగవానుడు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సూర్య…
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో అల్లు అర్జున్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే…
Ap Intermediate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న…
This website uses cookies.