RRR Naatu Naatu Won Oscar : నాటు నాటు కి ఆస్కార్ రావడం మీద కుక్క ఏడుపులు ఏడుస్తున్నారు .. బయటవాళ్ళు కాదు మనోళ్ళు .. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR Naatu Naatu Won Oscar : నాటు నాటు కి ఆస్కార్ రావడం మీద కుక్క ఏడుపులు ఏడుస్తున్నారు .. బయటవాళ్ళు కాదు మనోళ్ళు .. !

 Authored By prabhas | The Telugu News | Updated on :14 March 2023,9:20 pm

RRR Naatu Naatu Won Oscar : దర్శక ధీరుడు దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ : సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును పొందింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. మన తెలుగువారి సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఆస్కార్ అవార్డు అంత గొప్పదా వాళ్లు మన సినిమాలను గుర్తించడం గురించి అంత సంతోషించాలా. మన దగ్గర హాలీవుడ్ సినిమాలకు మించిన అద్భుతమైన కళాకాండలు లేవా,

RRR Naatu Naatu won Oscar some person jealous feel that

RRR Naatu Naatu won Oscar some person jealous feel that

వాళ్లు మన సినిమాలు గుర్తించి గుర్తింపు ఇవ్వటం ఏంటి అని వాదించే వాళ్లు కూడా ఉన్నారు.కానీ మన సినిమాలను ప్రపంచం ఎప్పుడు గుర్తించింది లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా వలనే ఇండియన్ సత్తా ఏంటో తెలుస్తుంది. దీనివలన మన సినిమాల మార్కెట్ పెరుగుతుంది. ఇండియన్ సినిమా గ్లోబల్ వైజ్ గా గుర్తింపు పొందుతుంది. ఇందుకు మనం సంతోషించాలి. ఇకపోతే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇండియన్ సినిమాల్లో ఇంతకు మించిన పాటలు లేవా, రాజమౌళికి ఆర్థిక బలం ఉండబట్టి ఆస్కార్ అవార్డు కోసం అమెరికాలో కోట్లు ఖర్చు చేస్తున్నాడని, కాబట్టి ఈ పాటకు ఆస్కార్ వచ్చింది, ఇలా అన్ని పాటలు ప్రమోట్ చేసుకోవడం కుదురుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

Oscars 2023: SS Rajamouli's RRR Song 'Naatu Naatu' Takes Home Best Music  (Original Song) Award

ఇకపోతే కోట్లు ఖర్చు చేస్తే ఆస్కార్ అవార్డు రాదు, అలా అయితే వందల కోట్ల బడ్జెట్ పెట్టుకొని అందరూ ఆస్కార్ అవార్డు కోసం ట్రై చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊహించని విధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడంతో మరి ముఖ్యంగా హాలీవుడ్లో నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అమెరికన్లు ఈ పాటకు డ్యాన్స్ వేయడం ఇవన్నీ చూసాకే రాజమౌళి టీం అంతర్జాతీయ వేడుకలకు ఆ పాటను తీసుకెళ్లడం చేశారు. ఆ క్రమంలో అవసరమైన చోట ప్రమోషన్ల కోసం ఖర్చు పెట్టారు. ఇలా చాలామంది ఆస్కార్ కోసం ప్రమోట్ చేస్తూ ఉంటారు. చేసిన వారందరికీ ఆస్కార్ అవార్డు అనేది రాదు అని విమర్శకులు తెలుసుకోవాలి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది