RRR : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా బాహుబలి 2 యొక్క రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతున్నారు. కానీ ఈ సినిమా టాక్ చూస్తుంటే ఓపెనింగ్ వసూళ్ల ను పరిగణలోకి తీసుకుంటే కచ్చితంగా బాహుబలి 2 రికార్డు సేఫ్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ సినిమా వసూళ్లు దక్కించుకోవడం ఖాయం.. కాని బాహుబలి 2 ని బీట్ చేయలేదు.. నెం. 2 మాత్రమే సాధ్యం అని దీంతో నిరూపితమైంది .
దాదాపుగా రూ. 1800 కోట్ల వసూళ్ల ను బాహుబలి 2 సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా 1000 కోట్ల వరకు వసూలు సాధిస్తుంది ఏమో కానీ అంతకు మించి సాధించలేక పోవచ్చు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. బాలీవుడ్ తో పాటు ఇతర దేశాల్లో మరియు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ భారీ మల్టీ స్టారర్ మూవీ సరికొత్త రికార్డులను సొంతం చేసుకోకున్నా బాహుబలి రికార్డు కి చేరువ అయ్యే విషయంలో సఫలం అవ్వక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. బాహుబలి 1 కి సంబంధించిన రికార్డులను బ్రేక్ చేయడం లో ఖచ్చితంగా ఈ సినిమా సఫలం అవుతుంది కానీ బాహుబలి2 విషయంలో మాత్రం ఈ సినిమా వెనుకంజ వేయక తప్పదు అనే టాక్ వినిపిస్తోంది.
ఇద్దరు హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి కూడా హీరో ప్రభాస్ యొక్క రికార్డును బ్రేక్ చేయలేక పోతున్నారు అంటూ ప్రభాస్ అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఈ సమయంలో బాహుబలి 2 యొక్క వసూళ్ల లెక్కలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఈ స్థాయిలో నమోదు చేస్తోందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు ఖచ్చితంగా ఈ సినిమా బాహుబలి 2 యొక్క రికార్డును బద్దలు కొడుతుంది అనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పూరి వసూళ్లు ఎంత అనేది మొదటి వారం పూర్తయ్యే సరికి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.