Samantha : గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ కొట్టిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. ఈ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా ఫీవర్ నడుస్తుంది. `పుష్ప` కరోనా సమయంలో విడుదలై మూడువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి సంచలనంగా మారింది. ఇక `పుష్ప2` తో బాక్సాఫీసు రికార్డ్ ల వేటకు సిద్ధమవుతున్నాడు. పుష్ప 2 చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా కంటిన్యూ కానుంది. మిగిలిన పాత్రలన్నీ ఉండబోతున్నాయి. విలన్‌గా ఫహద్ ఫాజిల్, అలాగే అనసూయ, సునీల్ పాత్రలు యధావిధిగా ఉండబోతున్నాయి. దీనికితోడు అందాల సీనియర్ తార ఇంద్రజని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం.
గ్లామర్ కోసం పుష్ప 2 లో దిశా పటానీని తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత కోసం ప్రత్యేకంగా స్పెషల్ రోల్ డిజైన్ చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తుంది. సమంత దర్శకుడు సుకుమార్ తనకు లక్కీ సెంటిమెంట్‌గా మారింది. `రంగస్థలం`లో ఆమె హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. దర్శకుడిగా ఆ చిత్రంతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఆ తర్వాత తీసిన `పుష్ప`లో ఐటెమ్ సాంగ్ రూపంలో సమంతని పెట్టి ఆ సెంటిమెంట్‌ని రిపీట్ చేశాడు. దీంతో సమంత తనకు లక్కీ ఛార్మ్ గా మారిందని భావిస్తున్నారట.దీంతోమరోసారి ఆమెని రిపీట్ చేయాలనుకుంటున్నారట. కాకపోతే ఆమెతో ఐటెమ్ సాంగ్ చేయిస్తాడా? లేక మరేదైనా కీ రోల్ చేయిస్తాడా? అనేది సస్పెన్స్ గా ఉంది.
సమంతకి కూడా `పుష్ప` చాలా హెల్ప్ అయ్యింది. నాగచైతన్యతో విడాకుల అనంతరం బ్యాక్ అయిన ఆమెకి `పుష్ప` పెద్ద బూస్ట్ నిచ్చింది. తన క్రేజ్‌ని చాటి చెప్పింది. ఓ రకంగా సమంతకి కమ్‌బ్యాక్‌కి ఫుల్ ఎనర్జీనిచ్చింది. ఇందులో ఆమె చేసిన సాంగ్‌కి విశేషస్పందన లభించింది. సమంత బోల్డ్ నిర్ణయంతో, హాట్‌గా కనిపించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. ఎంతో మందికి దగ్గరైంది. ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. పుష్ప`లో ఐటెమ్ సాంగ్‌ని సమంత చేత చేయించడం కోసం అల్లు అర్జున్ స్వయంగా ఇన్‌వాల్వ్ అయ్యారు. సమంతని ఒప్పించాడు. ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మరోసారి ఆ రిస్క్ బన్నీ తీసుకుంటాడా? అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.