Home » Entertainment » Rrr Song Sung By Ranveer Singh
Entertainment

RRR Movie : నాటు నాటు సాంగ్ పాట పాడిన దీపికా ప‌దుకొణే భ‌ర్త‌

Authored By
Sam C
The Telugu News | Published on: March 29, 2022, 2:30 pm
Advertisement

RRR Movie : భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సెన్సేష‌న్స్ క్రియేట్ చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్ RRR Movie. ఈ​ మూవీలో ఎన్​టీఆర్​ కొమురం భీమ్​గా కనిపించగా.. రామ్ చరణ్​ అల్లూరి సీతారామరాజుగా నటించారు. బ్రిటీష్ పాలనపై.. కల్పిత కథతో తీసిన మూవీ ఇది. ఈ మూవీని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​తో డీవీవీ దానయ్య తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో భారీ తారాగణం నటిచింది. బాలీవుడ్​ బ్యూటీ ఆలియా భట్​ హీరోయిన్​గా నటించారు. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్​గన్​ సహా, సముద్రఖ‌ని, శ్రియాలు కీలక పాత్రల్లో కనిపించారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్​ టాక్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం రికార్డులు కొల్ల‌గొడుతూ దూసుకుపోతుంది.

Advertisement

ట్రిపుల్ ఆర్ RRR Movie  సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను పెంచుకొంటూ తడాఖా చూపిస్తు్నది. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కలెక్షన్లను మరింత మెరుగు పరుచుకొంటున్నది. తొలి రోజు కలెక్షన్లకు అటూ ఇటుగా వసూళ్లను నమోదు చేస్తున్నది. హిందీ సెక్టార్‌లో చిత్ర కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం తగ్గేదేలే అనే రేంజ్‌లో వసూళ్లను నమోదు చేస్తున్నది. సోమవారం సుమారు 15 కోట్ల నికర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

rrr Movie song sung by ranveer singh

Advertisement

RRR Movie : దీపికా ప‌దుకొణే భ‌ర్త‌కు భ‌లే న‌చ్చేసిందిగా..

అయితే తొలి సోమవారం అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సాధించిన 14.25 కోట్ల మార్కును అధిగమిస్తుందా అనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ చిత్రం తొలి వారం తర్వాత 120 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ హీరో, దీపికా ప‌దుకొణే భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలని సైతం బాక్సాఫీస్ దగ్గర బీట్ చేసేసి దూసుకెళ్తుంది అని, ఇది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది అని తెలిపాడు. అలాగే తెలుగు నాటు నాటు సాంగ్ పాడేసి ఆశ్చర్య పరిచాడు. ఫైనల్ గా రాజమౌళి ఇలాంటి గ్రేట్ సినిమాలతో ఇండియన్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ప‌య‌నించేలా చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారిందంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి