Hair Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం చాలా పెద్ద సమస్యగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. టీనేజీ పిల్లల్లలోనూ జుట్టు రాలడం వారిని ఒత్తిడికి గురి చేస్తుంది. జుట్టు రాలడం ఆరోగ్య సమస్యగానే కాకుండా మానసిక సమస్యగా మారింది. చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు రకరకాల షాంపూలు, నూనెలు చాలా వాడి వాడి విసిగిపోయి ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఒక సారి ట్రై చేయండి.
ఈ చిట్కా జుట్టును రాలకుండా ఆపడంతో పాటు చుండ్రు సమస్యను పరిష్కరిస్తుంది. జుట్టు బలంగా నిగ నిగలాగే జుట్టు సొంతం అవుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. జుట్టు రాలడం, చుండ్రు, తల దురద పెట్టడం, జుట్టు ఎదగకపోవడం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఇంట్లోనే తయారు చేసుకుని జుట్టుకు పెట్టుకుంటే జుట్టును పొడవుగా ఒత్తుగా పెరిగే లాగా చేసుకోవచ్చు.దీని కోసం కావలసినవి పెరుగు, అలోవెరా జెల్, శీకాకాయ పొడి. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. పెరుగు.. స్కాల్ప్‌పై ఉండే ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. ఒక చెంచా శీకాకాయ పొడి వేసుకోవాలి. చింతకాయ గురించి దాని ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న అద్భుతమైన కాయ. ఇది జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ కూడా చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది.
అలాగే మాడుపై ఉండే ఇన్ఫెక్షన్‌ను పోగొడుతుంది. పెరుగు, శీకాకాయ పొడి, అలోవెరా జెన్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత జుట్టును నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే ప్రయోజనం కనిపిస్తుంది. జుట్టు నిగనిగ లాడుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతుంది. తలస్నానం చేసిన తర్వాత ఎలాంటి కండిషనర్లు వాడాల్సిన అవసరం లేదు. ఈ ఈజీ చిట్కాతో చుండ్రు తగ్గించుకోవడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగ్గా పెరుగుతుంది. ఈ చిట్కాతో మరో ప్రయోజనం ఏమిటంటే.. దీనిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.