Home » Entertainment » S S Rajamouli After Rrr Rajamouli Going To Do His Next Movie With Mahesh Babu
Entertainment

SS Rajamouli : మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా.. ఆ జోనర్‌లోనే..

Authored By
mallesh
The Telugu News | Published on: December 12, 2021, 7:40 pm
Advertisement

SS Rajamouli : టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని దేశంలోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు అనుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కనీసంగా ఆయన సినిమాలో ఒక్క పాత్ర లభించినా చాలు చేసేస్తామని అనుకునే నటీనటులు బోలెడు మంది ఉన్నారు. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ తర్వాత తాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నానని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఆ సినిమా ఏ జోనర్‌లో ఉండబోతున్నదంటే..

Advertisement

రాజమౌళి తన టేకింగ్.. అండ్ సినిమా మేకింగ్‌తో ప్రపంచమంతా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు. ఇక రాజమౌళి పుణ్యమాని ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. కాగా, మహేశ్ బాబు కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అవుతారని సూపర్ స్టార్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మహేశ్‌తో రాజమౌళి సినిమా చేయబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ, అధికారికంగా ప్రకటన రాలేదు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో తన నెక్ట్ట్ మూవీ మహేశ్ బాబుతోనేనని రాజమౌళి ప్రకటించేశారు.

ss rajamouli after rrr rajamouli going to do his next movie with mahesh babu

Advertisement

SS Rajamouli : మహేశ్ ను మరో లెవల్‌లో చూపించబోతున్న జక్కన్న..

ఈ క్రమంలోనే రాజమౌళి జేమ్స్ బాండ్ తరహ పాత్రతో మహేశ్ బాబుతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినబడుతోంది. ఈ విషయమై ఇప్పటికే తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ను స్టోరి రెడీ చేయాలని చెప్పాడట జక్కన్న. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్‌గా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత స్టోరితో మహేశ్ బాబును జక్కన్న కలుస్తాడని సూపర్ స్టార్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఆ లోపు తనకున్న తన ‘సర్కారువారి పాట’ సినిమా షూట్ కంప్లీట్ చేయనున్నారు మహేశ్. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి