SS Rajamouli : కొవిడ్ మహమ్మారి వల్ల పెద్ద సినిమాల విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా చాలా చిత్రాలు బరిలో నిలబడబోతున్నాయి. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌తో పోటీ పడబోయే చిత్రాలపై టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ‘డ్యాన్స్ నెంబర్’ నాటు నాటు సాంగ్‌కు..తారక్, చెర్రీల వీర నాటు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ సంగతులు అలా ఉంచితే.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలు చాలానే విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పోటీ పడబోయే సినిమా ఏదని, ఆ సినిమాలపైన అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు రాజమౌళిని ప్రశ్నించారు. కాగా, రాజమౌళి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. సినిమా బాగుంటేనే నడుస్తుందని, అన్ని సినిమాలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.
తన ఒక్కడి సినిమానే బాగుండాలని అనుకోవడం లేదని, అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. ఇకపోతే వచ్చే ఏడాది జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 12న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. 1920 ల నాటి కథగా ఫిక్షనల్ స్టోరిగా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
క్రేజీ కాంబినేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై మెగా, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిచంనుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్నారు. ఇక వీరికి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా ‘సీత’గా బ్యూటిఫుల్ ఆలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా నటిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.