SS Rajamouli : సినిమా బాగుంటేనే నడుస్తుంది.. సంక్రాంతి బరిలోని చిత్రాలపై రాజమౌళి సంచలన కామెంట్స్..!

Advertisement

SS Rajamouli : కొవిడ్ మహమ్మారి వల్ల పెద్ద సినిమాల విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా చాలా చిత్రాలు బరిలో నిలబడబోతున్నాయి. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌తో పోటీ పడబోయే చిత్రాలపై టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ‘డ్యాన్స్ నెంబర్’ నాటు నాటు సాంగ్‌కు..తారక్, చెర్రీల వీర నాటు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సంగతులు అలా ఉంచితే.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలు చాలానే విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పోటీ పడబోయే సినిమా ఏదని, ఆ సినిమాలపైన అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు రాజమౌళిని ప్రశ్నించారు. కాగా, రాజమౌళి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. సినిమా బాగుంటేనే నడుస్తుందని, అన్ని సినిమాలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.

Advertisement
ss rajamouli sensational comments on pongal release films
ss rajamouli sensational comments on pongal release films

SS Rajamouli : అన్ని చిత్రాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్న రాజమౌళి..

తన ఒక్కడి సినిమానే బాగుండాలని అనుకోవడం లేదని, అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. ఇకపోతే వచ్చే ఏడాది జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 12న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. 1920 ల నాటి కథగా ఫిక్షనల్ స్టోరిగా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

క్రేజీ కాంబినేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై మెగా, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిచంనుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్నారు. ఇక వీరికి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా ‘సీత’గా బ్యూటిఫుల్ ఆలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా నటిస్తోంది.

Advertisement
Advertisement