Sada : అతని చేతుల్లో దారుణంగా మోసపోయిన సదా.. అందుకే ఇప్పటివరకు మ్యారేజ్ చేసుకోలేదా..?

Advertisement

Sada : తెలుగు తెర మీద జయం సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ సదా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలానే ఉంది. జయం నుంచి 2018లో వచ్చిన టార్చిలైట్ వరకు రకరకాల సినిమాలు చేసిన సదా ఇప్పటికీ తను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక స్టార్ హీరో అని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సదా మరాఠి ఫ్యామిలీకి చెందగా ముంబైలో వారి ఫ్యామిలీ సెటిల్ అయ్యింది. మోడల్ గా చేస్తున్న టైం లోనే తేజ చూసి ఆమెని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. జయం సినిమాతో నితిన్, సదా ఇద్దరు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఈ సినిమా తర్వాత చియాన్ విక్రం అపరిచితుడులో కూడా నటించింది సదా. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే ఓ స్టార్ హీరోని ప్రేమించిందట. ఆమె వైపు నుంచి అతనికి పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టిందట. అయితే ఆ హీరో మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపలేదని టాక్. అయితే చేసుకుంటే ఆ హీరోనే చేసుకోవాలని అలానే బ్యాచిలర్ గా ఉండిపోయిందట సదా. ఇంతకీ సదా ప్రేమించిన ఆ హీరో ఎవరు. సదా ఎందుకు ఇంత డెశిషన్ తీసుకుంది అన్నది మాత్రం తెలియలేదు. ఈమధ్య ఢీ షోలో కూడా సందడి చేసిన సదా మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది.

Advertisement
sada cheated by star hero tollywood
sada cheated by star hero tollywood

ఒకప్పుడు ఉన్న తన క్రేజ్ వర్క్ అవుట్ అవట్లేదని తెలుసుకున్న అమ్మడు పాత్రల్లో కూడా నటించడం మొదలు పెట్టింది. అయినా కూడా సదాకి క్రేజ్ రాలేదు. ఇప్పుడు మల్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్న సదా ఛాన్స్ వస్తే ఎలాంటి సినిమానైనా చేస్తానని అంటుంది. మరి సదా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. సదాకి ఇప్పటికీ సూపర్ ఫాలోయింగ్ ఉండగా అమ్మడు వరుస సినిమాలు చేస్తే తమకి పండుగే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సదా ఇన్నాళ్లకు ఈ విషయం చెప్పినా ఇంతకీ ఆ హీరో ఎవరన్నది మాత్రం ఇప్పటికీ చెప్పట్లేదు. ఖచ్చితంగా సదా ఆ హీరో పేరు ఫ్యూచర్ లో అయినా బయటపెడుతుందని చెప్పొచ్చు.

Advertisement
Advertisement