Sadhna Singh on Friendsip with Samantha Ruth Prabhu
Samantha : సమంత అంటే.. కేవలం సమంత మాత్రమే కనిపించదు. ఆమె చుట్టూ ఓ కోటరి ఉంటుంది.నిత్యం ఆమె చుట్టూ ఓ ఐదారుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వారే ఆమె ప్రపంచం అన్నట్టుగా చూపిస్తుంటుంది సమంత. అందులో స్టైలీష్ట్ ప్రీతమ్ జుకల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనసింగ్, డాక్టర్ మంజుల, చిన్మయి శ్రీపాద వంటి వారే సమంతకు లోకంగా ఉంటారు. ఇక డైరెక్టర్ నందినీ రెడ్డి కూడా సమంతకు ఫ్రెండే. కానీ ఎక్కువగా కనిపించదు.తెరపై మాత్రం ప్రతీమ్, సాధనలే ఎక్కువగా కనిపిస్తుంటారు. సమంత ఏ సినిమా చేసినా కూడా ఈ ఇద్దరూ ఆమెతోనే ఉంటారు. మొన్నటి ఖుషీ షూటింగ్ అయినా.. అంతకుముందు చేసిన యశోద షూటింగ్ అయినా.. దాని కంటేముందు చేసిన శాకుంతలం సినిమా అయినా కూడా ఈ ఇద్దరూ సమంత పక్కన ఉండాల్సిందే.
అయితే గత కొన్ని రోజులుగా ఈ ముగ్గురూ ఒక్క చోట కనిపించడం లేదు. ప్రీతమ్ తన పనిలో తాను బిజీగా ఉన్నాడు. కృతి శెట్టి,అల్లు స్నేహారెడ్డిలకు బట్టలు డిజైన్ చేసే బిజీలో ప్రీతమ్ ఉన్నాడు. ఈ మధ్య బన్నీ భార్య స్నేహా ధరిస్తున్న దుస్తులన్నీ కూడా ప్రీతమ్ డిజైన్ చేసినవే. ఇక మేకప్ ఆర్టిస్ట్ సాధన తన ఫ్యామిలీ వెకేషన్, ట్రిప్స్‌తో బిజీగా ఉంటోంది. సమంత ఎక్కడ ఉందో క్లారిటీ లేదు. ఈ మధ్య సమంత అసలు సోషల్ మీడియాలోనే కనిపించడం లేదు. చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియాకు ఆమె ఎందుకు దూరంగా ఉందన్న విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
Sadhna Singh on Friendsip with Samantha Ruth Prabhu
మొత్తానికి చాలా రోజులకు ఇలా సమంత ఇన్ యాక్టివ్ అయింది. కాకపోతే ఇదే విషయంలో అందరికీ అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా సమంత ఫ్రెండ్ కమ్ మేకప్ మెన్ అయిన సాధన సింగ్‌కు ప్రశ్నలు ఎదురయ్యాయి. సమంతతో మీ ఫ్రెండ్ షిప్ ఇంకా ఉందా? కంటిన్యూ చేస్తున్నారా? అని ఓ నెటిజన్ అడిగేశారు. దానికి సాధన అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఫ్రెండ్ షిప్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఎందుకు అలా అడుగుతున్నారన్నట్టుగా కౌంటర్లు వేసింది. మొత్తానికి ఈ ముగ్గురు కలిసి కనిపించికపోవడంతో అందరికీ ఇలా అనుమానాలు పుట్టుకొచ్చేస్తున్నాయి.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.