Viral Video on 60 year old women Utti Kotte festival with joy
Viral Video : దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒక్కో ప్రాంతంలో ఉండే సంప్రదాయాలకు అనుగుణంగా అక్కడి ప్రజలు జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకున్నారు. కొందరు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తే మరికొందరు ఉట్టి కొట్టి రంగులు పూసుకున్నారు. ీ క్రమంలోనే ఓ 60 ఏళ్ల వృద్దురాలు చేసిన ఫీట్‌కు ఏకంగా సోషల్ మీడియా షేక్ అవుతోంది. అసలు ఆ బామ్మ ఏం చేసింది. అంతలా నెటిజన్లు సోషల్ మీడియాను ఎందుకు షేక్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలో కృష్ణుడి జన్మదినం సందర్భంగా చాల చోట్లా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ వేడకకు ప్రజలు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కొవిడ్ భయానక పరిస్థితులు కొద్దిగా తగ్గముఖం పట్టడంతో ప్రజలంతా సంతోషంగా ఉట్టి కొట్టే పండుగను ఆనందంగా జరిపారు. ఈ క్రమంలోనే దహీ హండీ వేడుకల్లో ఓ 60 ఏళ్ల వృద్ధురాలు చేసిన ఫీట్ అందరినీ షాక్‌కు గురిచేసింది. ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ వింతకు సంబంధించి వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారి దీపాన్ష్ కాబ్రా షేర్ చేశారు.
Viral Video on 60 year old women Utti Kotte festival with joy
ఇందులో కొందరు మహిళలు మానవ పిరమిడ్ ఆకారంలో నిల్చున్నారు.ఈ క్రమంలో మహిళలపైకి ఎక్కి ఓ ముసలావిడ దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను(ఉట్టి)ని ఆమె తలతో బద్దలు కొట్టింది. తర్వాత తాడు సాయంతో నెమ్మెదిగా కిందకు దిగుతుంది. ఈ వీడియోపై దీపాన్ష్ కాబ్రా స్పందస్తూ ‘ది ఇన్‌క్రెడిబుల్ దాదీ’ అని క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. దెబ్బకు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వ్యూస్ పరంగా సంచలనం క్రియేట్ చేసింది. కొద్ది టైం లోనే 1,87,000 కంటే ఎక్కువ వ్యూస్‌ను, దాదాపు 10,000 లైక్‌లను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. వృద్ధురాలి ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Virat Kohli : కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) రిటైర్‌మెంట్ ప్రకటించనున్నాడనే…
Surendra Moga : భారత్ , పాక్ ఉద్రిక్తతలు వేళ అమెరికా సహా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల…
Side Effects Of Bananas : అరటిపండ్లు మార్కెట్లలో అత్యంత ఆరోగ్యకరమైన మరియు సులభంగా లభించే పండ్లలో ఒకటి. కానీ…
Bay Leaf Tea : బిర్యానీ ఆకు లేదా తేజ్ పట్టా కేవలం సుగంధ ద్రవ్యాల తయారీ కంటే చాలా…
Medicinal Plants : ఔషధ మొక్కలు అంటే వేర్లు, కాండం, ఆకులు మొదలైన భాగాలను చికిత్సా మరియు చికిత్సా ప్రయోజనాల…
Makhana : వేసవికాలం వేడి పెరుగుతున్న కొద్దీ హైడ్రేటెడ్ గా, శక్తివంతంగా ఉండటం ప్రాథమిక ఆందోళనగా మారుతుంది. చాలా మంది…
Railway RRB ALP Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ లేదా ALP…
Jupiter : దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం ఉంటే ఆ రాశులవారి జీవితం అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి తర్వాత అత్యంత…
This website uses cookies.