Home » Entertainment » Sadhna Singh On Samantha And Preetham Jukalker
Entertainment

Samantha : సమంత ప్రీతమ్ మధ్య ఉన్న బంధమిదే.. సంచ‌ల‌న విష‌యాలు బయటపెట్టిన మేకప్ ఆర్టిస్ట్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 7, 2021, 1:50 pm
Advertisement

Samantha  : సమంత చుట్టూ ఈ మధ్య కొంత మంది కనిపిస్తున్నారు. ఆమె కోటరిలా కొంత మంది తయారయ్యారు. వారే సమంత మైండ్‌ను వాష్ చేశారని, ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునేందుక పురిగొల్పారనే టాక్ బయటకువచ్చింది. అందులో దర్శకురాలు నందినీ రెడ్డి, మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్, ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్, గైనకాలజిస్ట్, చిన్మయి వంటి వారు సమంతను మార్చేశారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా చైసామ్ విడాకులకు ప్రీతమ్ కారణంగా లేనిపోని అక్రమ సంబంధాలను అంటగడుతున్నారు.

Advertisement

Sadhna Singh On Samantha And Preetham Jukalker

గతంలో ప్రీతమ్ జుకల్కర్, సమంత మధ్య ఉన్న సంబంధం గురించి ఎంతో చర్చ జరిగింది. కానీ సమంతను జీజీ (అక్కా) అంటూ ప్రీతమ్ పిలుస్తాడని క్లారిటీ వచ్చింది. కానీ ఈ విడాకుల వెనుక ఉన్నది మాత్రం ప్రీతమ్ అంటూ అభిమానులు చెత్త సంబంధాలన్ని అంటగట్టేశారు. దానికి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ (ఫ్యామిలీ మెన్ సీజన్ 2 నుంచి) తాజాగా మండిపడింది. సమంత, ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పేసింది.

Advertisement

Samantha  : సమంత ప్రీతమ్ మధ్య ఉన్న బంధమిదే

reasons behind samantha naga chaitanya divorce

సమంత-ప్రీతమ్‌కు మధ్య ఉన్న బంధాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ సాధన సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ప్రీతమ్‌..సమంతను అక్కా(జీజీ)అని పిలుస్తాడు. జీజీ అంటే అర్థం తెలుసు కదా..అంటూ ఘాటుగా బుదులిచ్చింది. ఆ దేవుడు నాకు తెలివిని ప్రసాదించాడు. దీన్ని కొందరు తెలివిలేని వాళ్లకు పంచుదామని అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి సమంత, ప్రీతమ్ మధ్య ఉన్న సంబంధాన్ని అలా బయటపెట్టేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి