Home » Entertainment » Sai Dharam Pawan Kalyan Multi Starrer Update On This Month
Entertainment

Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఇక మెగా అభిమానుల్లో జోష్ పీక్స్‌లో…!

Authored By
Sam C
The Telugu News | Published on: March 1, 2022, 2:30 pm
Advertisement

Pawan Kalyan : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ హంగామా న‌డుస్తుంది. చిన్న హీరోల‌తో పాటు పెద్ద హీరోలు అలానే పెద్ద హీరోలు క‌లిసి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్ రూపొంద‌నుందంటూ ప్ర‌చారం న‌డుస్తుంది. ఇటీవల తమిళ దర్శకుడు, నటుడు సముద్ర‌ఖ‌ని న‌టించి ద‌ర్శ‌కత్వం వ‌హించిన తాజా చిత్రం వినోద‌య సితం తెలుగులో రీమేక్ కానుందని అంటున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు సమాచారం. అంతేకాదు ఇదే సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో మెగామేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్‌ తేజ్ కూడా న‌టించనున్నాడ‌నే వార్త ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌పై నిర్మించనుండ‌గా, తీనికి స‌ముద్ర‌ఖని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందా, ఎప్పుడు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌స్తుందా అని అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మం మార్చి 25న జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అప్పుడే సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక‌ ప్రైవేట్ కంపెనీలో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసే ఓ వ్యక్తి ఒక కార్ యాక్సిడెంట్‌లో చ‌నిపోతారు.

Sai Dharam Tej Pawan Kalyan multi starrer update on this month

Advertisement

Pawan Kalyan :హంగామా అప్ప‌టి నుండే..

చనిపోయిన వ్య‌క్తి ఆత్మ‌ను తీసుకెళ్ళ‌డానికి దేవుడు రావడం.. ఆ చ‌నిపోయిన వ్య‌క్తి తాను చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయ‌ని చెప్పి.. కొంత స‌మ‌యం కావాలంటూ అడగడంతో.. దేవుడు మూడు నెల‌ల స‌మ‌యాన్ని చ‌నిపోయిన వ్య‌క్తి కి ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ మల్టీస్టారర్ సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుంది. అంచనాల స్థాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరైన కథ సెట్ అయితే గాని అలాంటి ప్రాజెక్టులో సెట్స్ పైకి రావని చెప్పవచ్చు. ఇక త్వరలోనే ఈ మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్ట‌నున్నార‌ని స‌మాచారం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి