Samantha Emotional Post
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఆమె నటించిన శాకుంతలం చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నిర్మాత నీలిమ గుణ పలు ఇంటర్వ్యూలలో సమంత గురించి ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ మధ్య చై సామ్ విడాకులపై స్పందించింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుంది కానీ ఆగస్టులో ఏదో జరిగి విడాకులు తీసుకున్నారు. “శాకుంతలం సినిమా కోసం మా నాన్న (దర్శకుడు గుణశేఖర్) సమంత ని సంప్రదించారు. అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నానని అందుకే సినిమా చేయనని చెప్పారు.
కథ నచ్చడంతో ఓకే చెప్పారు ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఆమె కోరారు. మేము కూడా షూటింగ్ అలానే ప్లాన్ చేసాము. సమంతా సినిమాలకి విరామం ఇచ్చి పిల్లల్ని కనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు అని ఆ మధ్య నీలిమ గుణ చెప్పుకొచ్చింది. ఇక తాజా ఇంటర్వ్యూలో సమంత మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిందని ఆమె చెప్పినట్టు మేం చేశామని అన్నారు. సినిమా స్టార్ట్ చేయక ముందు సమంత చిత్రం కోసం ఎక్కువ మంది మహిళలను తీసుకోవాలని కోరింది. ఆమె ఆలోచన మాకు కూడాబాగా నచ్చింది.సమంత చెప్పినట్టుగానే సినిమా కోసం ఎక్కువ మంది టెక్నీషియన్స్‌ని తీసుకున్నాం. శాకుతలం కోసం చాలా మంది మహిళలే పని చేశారు అంటూ నీలిమ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
samantha says girl power to stunning post
అయితే నీలిమ ఇంటర్వ్యూ పేపర్ కటింగ్‌ని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గార్ల్ పవర్ అని కామెంట్ పెట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియన్ చిత్రం మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు.
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.