Sai Dharam Tej : మెగా ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పీటలెక్కబోతున్న కుర్ర హీరో ఎవరంటే..!
Sai Dharam Tej : ప్రస్తుతం మెగా ఇంట అన్ని శుభాలే జరుగుతున్నాయి. క్లింకార వచ్చిన వేళావిశేషం ఏమో కాని మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీ ఉంది. క్లింకార పుట్టాక రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలానే చరణ్‌కి గ్లోబల్ స్థాయి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఇక వరుణ్ తేజ్ తన ప్రేయసిని పెళ్లాడాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఏళ్లుగా ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ 2023 నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. వరుణ్-లావణ్యల పెళ్లి వేడుకకు మెగా హీరోలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఇక ఆ తర్వాత చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ రావడం, ఇక రీసెంట్‌గా పవన్ ఎన్నికలలో గెలుపొందడం జరిగింది.
పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీకి వెళ్లడమే కాకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. కాగా మెగా ఫ్యామిలీలో మరో వేడుక చోటు చేసుకోనుందని సమాచారం అందుతుంది. హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడని సమాచారం. చిరంజీవి చెల్లెలు కొడుకైన సాయి ధరమ్ ‘రేయ్’ సినిమాతో హీరోగా పరిచయం కాగా, ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రతిరోజూ పండగే సాయి ధరమ్ కెరీర్లో సూపర్ హిట్ గా ఉంది. బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఏడాది కాలం నటనకు దూరం ఉండగా, ఆ తర్వాత విరూపాక్ష అనే చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టింది.
Sai Dharam Tej : మెగా ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పీటలెక్కబోతున్న కుర్ర హీరో ఎవరంటే..!
ప్రస్తుతం పలు సినిమాలు లైన్‌లో పెట్టాడు. మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కి 37 ఏళ్లు ఉండగా, ఆయన పెళ్లికి సంబంధించి నిత్యం నెట్టింట వార్తలు వస్తూనే ఉన్నాయి. 37 ఏళ్ల సాయి ధరమ్ కి పెద్దలు పెళ్లి సంబంధం చూశారట. అమ్మాయి ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందినదట. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలుపుకున్నారట. త్వరలో సాయి ధరమ్ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారట. ఘనంగా ఎంగేజ్మెంట్, అనంతరం కొన్ని నెలలకు పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ప్రముఖంగా వార్త వినిపిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
This website uses cookies.