Sai Dharam Tej : మెగా ఇంట పెళ్లి సంద‌డి.. పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కుర్ర హీరో ఎవ‌రంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sai Dharam Tej : మెగా ఇంట పెళ్లి సంద‌డి.. పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కుర్ర హీరో ఎవ‌రంటే..!

Sai Dharam Tej : ప్ర‌స్తుతం మెగా ఇంట అన్ని శుభాలే జ‌రుగుతున్నాయి. క్లింకార వ‌చ్చిన వేళావిశేషం ఏమో కాని మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీ ఉంది. క్లింకార పుట్టాక రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ ద‌క్కింది. అలానే చ‌ర‌ణ్‌కి గ్లోబ‌ల్ స్థాయి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కాయి. ఇక వరుణ్ తేజ్ తన ప్రేయసిని పెళ్లాడాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఏళ్లుగా ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ 2023 నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2024,6:43 pm

ప్రధానాంశాలు:

  •  Sai Dharam Tej : మెగా ఇంట పెళ్లి సంద‌డి.. పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కుర్ర హీరో ఎవ‌రంటే..!

Sai Dharam Tej : ప్ర‌స్తుతం మెగా ఇంట అన్ని శుభాలే జ‌రుగుతున్నాయి. క్లింకార వ‌చ్చిన వేళావిశేషం ఏమో కాని మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీ ఉంది. క్లింకార పుట్టాక రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ ద‌క్కింది. అలానే చ‌ర‌ణ్‌కి గ్లోబ‌ల్ స్థాయి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కాయి. ఇక వరుణ్ తేజ్ తన ప్రేయసిని పెళ్లాడాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఏళ్లుగా ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ 2023 నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. వరుణ్-లావణ్యల పెళ్లి వేడుకకు మెగా హీరోలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక ఆ త‌ర్వాత చిరంజీవికి ప‌ద్మభూష‌ణ్ అవార్డ్ రావ‌డం, ఇక రీసెంట్‌గా ప‌వ‌న్ ఎన్నిక‌ల‌లో గెలుపొంద‌డం జ‌రిగింది.

Sai Dharam Tej మెగా ఇంట పెళ్లి సంద‌డి..

పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీకి వెళ్లడమే కాకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. కాగా మెగా ఫ్యామిలీలో మరో వేడుక చోటు చేసుకోనుందని సమాచారం అందుతుంది. హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడని సమాచారం. చిరంజీవి చెల్లెలు కొడుకైన సాయి ధరమ్ ‘రేయ్’ సినిమాతో హీరోగా పరిచయం కాగా, ఆ త‌ర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రతిరోజూ పండగే సాయి ధరమ్ కెరీర్లో సూపర్ హిట్ గా ఉంది. బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఏడాది కాలం నటనకు దూరం ఉండ‌గా, ఆ త‌ర్వాత విరూపాక్ష అనే చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టింది.

Sai Dharam Tej మెగా ఇంట పెళ్లి సంద‌డి పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కుర్ర హీరో ఎవ‌రంటే

Sai Dharam Tej : మెగా ఇంట పెళ్లి సంద‌డి.. పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కుర్ర హీరో ఎవ‌రంటే..!

ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు లైన్‌లో పెట్టాడు. మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ కి 37 ఏళ్లు ఉండ‌గా, ఆయ‌న పెళ్లికి సంబంధించి నిత్యం నెట్టింట వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. 37 ఏళ్ల సాయి ధరమ్ కి పెద్దలు పెళ్లి సంబంధం చూశారట. అమ్మాయి ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందినదట. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలుపుకున్నారట. త్వరలో సాయి ధరమ్ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారట. ఘనంగా ఎంగేజ్మెంట్, అనంతరం కొన్ని నెలలకు పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ప్రముఖంగా వార్త వినిపిస్తుండ‌డంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది