Sai Dharam Tej Republic Review : సాయి ధరమ్ తేజ్.. ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sai Dharam Tej Republic Review : సాయి ధరమ్ తేజ్.. ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

అన్ని సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటోంది. దానికి కారణం సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సాయి.. హాస్పిటల్ లో ఉన్నాడు. ఇటీవలే ఆయనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సాయి ధరమ్ తేజ్.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాలేకపోయాడు. దీంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి.. ఈ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 October 2021,9:02 am

అన్ని సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటోంది. దానికి కారణం సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సాయి.. హాస్పిటల్ లో ఉన్నాడు. ఇటీవలే ఆయనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సాయి ధరమ్ తేజ్.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాలేకపోయాడు. దీంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి.. ఈ సినిమాను ఆదరించాలని తన అభిమానులను కోరారు.

sai dharam tej republic movie review

sai dharam tej republic movie review

రిపబ్లిక్ సినిమా ఇవాళ అంటే అక్టోబర్ 1, 2021, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో పాటు ఐశ్వర్యారాజేశ్, రమ్యకృష్ణ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వం వహించాడు.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి.

మంచి టాక్ తెచ్చుకున్నాయి. సాయి ఆసుపత్రిలో ఉన్నా.. ఆయన కోరడంతోనే అక్టోబర్ 1న సినిమాను ప్రపంచవ్యాప్తంగా దర్శకనిర్మాతలు రిలీజ్ చేశారు.ఈ సినిమా ప్రధానంగా మన సమాజంలో ఉండే సమస్యలు, వాటిని పరిష్కరించడం.. మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక.. సాయి ధరమ్ తేజ్ అయితే ఈ సినిమాలో తన బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. సమాజంలో ఉన్న సమస్యలతో పాటు.. దాంట్లో ఉన్న లోపాలు, లొసుగులను నాయకులు గానీ.. వేరే వ్యక్తులు కానీ ఎలా తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారో ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు.

సినిమా కథ ఇదే

సినిమా ప్రారంభమే తేజ్ ఎంట్రీ ఉంటుంది. తెల్లేరు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. సాయి ధరమ్ తేజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఈ సమాజానికి తన వంతుగా ఎంతో కొంత చేయాలి అని అనుకుంటాడు. ఇక.. రమ్యకృష్ణ(విశాఖ వాణి) పెద్ద రాజకీయ నాయకురాలిగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ వెనుక ఉండి నడిపించేది తనే. ఇక.. సాయి ధరమ్ తేజ్(అభి).. విదేశాల్లో స్థిరపడిన ఐశ్వర్యారాజేశ్(మైరా)తో ప్రేమలో పడతాడు. అలాగే కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తను ఐఏఎస్ ఆఫీసర్ అవడమే కాదు.. సమాజంలో తను ఒక నిజాయితి పరుడైన అధికారి అని నిరూపించుకుంటాడు. ఇలా.. ఫస్ట్ హాఫ్ గడిచిపోతుంది.

sai dharam tej republic movie review

sai dharam tej republic movie review

సెకండ్ హాఫ్.. ఒక రేప్ సమస్యతో ప్రారంభం అవుతుంది. అణువణువునా అవినీతితో కూరుకుపోయిన ఈ సిస్టమ్ లో అభి ఎన్నో చాలెంజ్ లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో విశాఖ వాణిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ లీగల్ ఇష్యూలో విశాఖ రాణిని కోర్టులో ఓడిస్తాడు అభి. దీంతో అతడి మీద పగ పెంచుకుంటుంది విశాఖ వాణి. ఈ నేపథ్యంలో విశాఖ వాణి.. అభిని ఏం చేస్తుంది? అభి.. ఆమెను ఇంకా మున్ముందు ఎలా ఎదుర్కొంటాడు.. అనేదే ఈ సినిమా కథ.

దర్శకుడి గురించి

ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడే. ఆయన ఇప్పటికే దర్శకత్వం వహించిన ప్రస్థానం సినిమా అందరికీ తెలుసు. సేమ్ అలాగే.. రిపబ్లిక్ సినిమాను కూడా దేవ్ కట్టా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే  ఈ సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో ప్రదర్శితం అయ్యాయి. ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిని దేవా కట్టా ఫోకస్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను దేవ్ కట్టా తెరకెక్కించారు.

sai dharam tej republic movie review

sai dharam tej republic movie review

ట్విట్టర్ లో ఈ సినిమా గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుతున్న అంశాలు ఇవే.. సాయి ధరమ్ నటన సూపర్బ్.. సాయి తండ్రిగా జగపతిబాబు నటన హైలైట్. హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ నటన కూడా అద్భుతం అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ మరికొద్ది నిమిషాల్లో అప్ డేట్ చేస్తాం.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది