
Sai Dharam Tej Thank Youy Note Video Goes Viral
Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రారంభించబోతోన్నాడు. అయితే దాని కంటే ముందుగా తనకు జరిగిన ప్రమాదం, ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాడు. అందుకే అందరికీ కలిపి థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో తనను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన వ్యక్తి నుంచి అభిమానుల వరకు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.‘హలో అందరికీ నమస్కారం.. గ్రాటిట్యూడ్, థ్యాంక్స్, ఫ్యామిలీ, హ్యాపీనెస్ ఇలా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ముందుగా నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన సయ్యద్ అబ్దుల్ ఫరుఖ్‌కు థ్యాంక్స్. భయ్యా.. మీరు హాస్పిటల్‌లో జాయిన్ చేయడం వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. థ్యాంక్స్. మానవత్వం ఇంకా బతికి ఉందంటే దానికి నిలువెత్తు నిదర్శనం మీరే. థాంక్యూ సో మచ్. మెడికోవర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వాళ్లకు థ్యాంక్స్.
చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చరణ్, బన్నీ, వరుణ్, వైషు, ఉపాసన అందరూ నాకోసం నిలబడ్డారు.రెండో ఫ్యామిలీ.. నేను హాస్పిటల్‌లో ఉన్నాని తెలిసి వచ్చిన నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్, తోటీ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా అందరికీ థ్యాంక్స్. ఇక మూడో ఫ్యామిలీ. ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే ఓన్లీ నా ఫ్యాన్సే కాదు. అందరి హీరోల ఫ్యాన్స్. అందరూ ఎన్నో పూజాలు చేశారు. కాలి నడకతో మెట్లు ఎక్కారు. అన్నదానాలు చేశారు. అందరికీ థ్యాంక్స్.నా హెల్త్ అప్డేట్‌లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు తెలియజేసిన మీడియాకు థ్యాంక్స్. అమ్మా, వైషు, శివ మీరంతా ధైర్యంగా ఉంటూ అందరికీ ధైర్యం ఇచ్చారు. మూడు నాలుగు వారాల వరకు మా అమ్మ నా ఫోన్ నాకు ఇవ్వలేదు. ఫోన్ నా చేతికి వచ్చాక మీ అందరి మెసెజ్‌లు చూశాను. మాటలు రాలేదు.
Sai Dharam Tej Thank Youy Note Video Goes Viral
నాతో పాటు నిలబడిన నా స్టాఫ్ అందరికీ థ్యాంక్స్.సతీష్ అన్న, నరేంద్ర, నాగరాజు, శర్మ ఈ నలుగురు నాతో పాటున్నారు. నన్ను చూసుకున్నారు. చిత్రహింసలు పడ్డారు. కోలుకుంటున్న సమయంలోనే రిపబ్లిక్ సినిమా వచ్చింది. అందరూ ఆదరించి సక్సెస్ చేశారు. తెలుగు వాళ్లు సినిమా లవర్స్ అని నిరూపించుకున్నారు.ఈ వీడియో ఎందుకు చేశామని అనుకుంటున్నారా? ఈ నెల 28న కొత్త సినిమా ప్రారంభిస్తున్నాను. దానికి సుకుమార్, బాబీ నిర్మాతలు. నేను కోలుకునేంత వరకు ఆగిన వారిద్దరికి థ్యాంక్స్. ఇది బుజ్జి తల్లి.. హెల్మెట్ పెట్టుకోవడం వల్లే బతికి ఉన్నా. కింద పడ్డా కూడా దానికి దెబ్బ తగిలింది. నాకు తగలేదు. అందరూ హెల్మెట్ ధరించండి. పక్క గల్లీకి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా కూడా పెట్టుకోండి. జై హింద్’ అని వీడియోలో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.