Sai Pallavi : సినిమాలు చేయ‌క‌పోతే సాయి ప‌ల్ల‌వి పెళ్లంటారా.. మండిప‌డుతున్న అభిమానులు

Authored By Sam C | The Telugu News | Published on: May 3, 2022, 1:30 pm

Sai Pallavi : మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు త‌న న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత ఎంట‌ర్‌టైన్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్ గా లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు ఆ సెన్సేషన్ ను చూపించాయి కూడా. అయితే రెండు భారీ విజయాల తర్వాత కూడా సాయి పల్లవి సైలెంట్ గా ఉండటం, కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ కాకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు ఆమె పెళ్లికి రెడీ అవుతుందన్న రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. సాయి పల్లవి పెళ్లి వార్తలను ఆమె సన్నిహితులు ఖండిస్తున్నారు.

స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండే సాయి పల్లవి మంచి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేగాని ఆమె పెళ్ళికి సిద్ధమయ్యారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వం మూవీ చేస్తున్నారు. షూటింగ్ కూడా కంప్లీట్ కాగా… విడుదల ఆలస్యమైంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన విరాటపర్వం మూవీలో సాయి పల్లవి విలేజ్ గర్ల్ రోల్ చేశారు. రానా ఈ మూవీలో నక్సల్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

sai pallavi fans fire on trollers

sai pallavi fans fire on trollers

Sai Pallavi : అన్నీ గాసిప్సే..

‘నేచురల్‌ బ్యూటీ’ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్ చదువుతుండగానే.. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మలార్ పాత్రలో అందరిని ఆకట్టుకున్నారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ‘ఫిదా’ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకుని స్టార్ అయ్యారు. ఆపై ఎంసీఏ, పడిపడిలేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో సత్తాచాటారు. భోళా శంక‌ర్‌లో కూడా సాయి ప‌ల్ల‌వి న‌టించాల్సి ఉన్నా కూడా పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతో నో చెప్పింది.

Sam C

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp