Sai Pallavi : హమ్మయ్య సాయి పల్లవి సినిమాలు మానేస్తోంది అనుకున్న సమంత, పూజా హెగ్డే, కృతి శెట్టిలకి దిమ్మతిరిగే బ్రేకింగ్ న్యూస్…!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 December 2022,9:00 pm

Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ ఫిదా ‘ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా నటించి అందరిని ఫిదా చేసింది. ఈ సినిమాలో తన డైలాగ్స్, నటన, అందాలకు ప్రేక్షకులు పడిపోయారు. ఈ సినిమా హిట్ తర్వాత తెలుగులో వరుసగా ఎన్నో సినిమాలను చేసింది సాయి పల్లవి. ఇప్పటివరకు సాయి పల్లవి చేసిన అన్ని సినిమాలలో సాంప్రదాయ బద్ధమైన పాత్రలు చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది.

ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా వివిధ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో తన నటనకు లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ను తగిలించారు అభిమానులు. ఇంతవరకు ఏ హీరోయిన్ కి ట్యాగ్ లేదు కాని సాయి పల్లవికి ఏకంగా లేడీ పవర్ స్టార్ బిరుదు ఇచ్చారు. అందుకే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ మారిపోయింది. ఏ సినిమాలో అయినా హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో అటువంటి సినిమాలను చేయడానికి ఈ అమ్మడు ఇష్టపడుతుంది. ఇంతవరకు ఏ సినిమాలో ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు.

Sai Pallavi latest movie update

Sai Pallavi latest movie update

తెలుగులో సాయి పల్లవి ఆఖరిగా చేసిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో హీరోగా దగ్గుపాటి రానా నటించాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఈ అమ్మడు త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ఓ సినిమాలో సాయి పల్లవికి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటించనుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి