Home » Entertainment » Sai Pallavi Stunning Comments Viral
Entertainment

Sai Pallavi : పొట్టి బ‌ట్ట‌లు వేసుకోక‌పోవ‌డానికి ఆ వీడియోనే కార‌ణం .. సాయి ప‌ల్ల‌వి షాకింగ్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 14, 2022, 5:30 pm
Advertisement

Sai Pallavi : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం.ఈ అమ్మడు ఎప్పుడూ కూడా నిండైన వస్త్రాల్లోనే కనిపిస్తుంది. ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంటుంది. అయితే సాయి పల్లవి మోడ్రన్ దుస్తులు వేసినా కూడా అందులో అశ్లీలత, అసభ్యకరంగా ఏమీ కనిపించదు. అందులోనూ నిండుదనమే కనిపిస్తుంది. అయితే ఇలా తన ఆలోచనలు, వస్త్రధారణ వెనుక అసలు విషయాన్ని సాయి పల్లవి పంచుకుంది. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో సాయి పల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.జూన్‌ 17న విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Advertisement

అయితే సినిమాల్లో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. తాజా ఇంటర్య్వూలో పొట్టి బట్టలు వేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అలాంటి అవుట్‌ ఫిట్‌లో కంఫర్ట్‌ ఉండనని చెప్పింది. అయితే దానికి కారణమేంటో కూడా ఈ సందర్భంగా సాయి పల్లవి వెల్లడించింది. తాను పొట్టి బట్టలు ధరించకపోవడానికి ఒక వీడియో కారణమంటూ తెలిపింది. ‘డాక్టర్‌ కోర్స్‌లో భాగంగా నేను జార్జీయా వెళ్లాను. ఆ సమయంలో టాంగో డాన్స్‌ నేర్చుకున్నాను. అయితే ఓ ఈవెంట్‌లో నేను టాంగ్‌ డాన్స్‌ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ డాన్స్‌ చేయాలంటే అందుకు అనుకూలంగా ఉండే కాస్ట్యూమ్స్‌ వేసుకోవాలి’ అని పేర్కొంది.

sai pallavi stunning comments viral

Advertisement

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి ఓపెన్ కామెంట్స్..

‘అయితే నేను ఈ డాన్స్‌ షో చేయడం మా పేరెంట్స్‌కు ఇష్టం లేదు. అయినా వారిని ఒప్పించి పర్ఫామ్‌ చేశాను. అదే సమయంలో నాకు ప్రేమమ్‌ మూవీ ఆఫర్‌ వచ్చింది. ఈ సినిమాలో నా నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ అప్పుడే జార్జీయాలో ఇచ్చిన నా డాన్స్‌ పర్ఫెమెన్స్‌ వీడియో బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు. కానీ, సోషల్‌ మీడియాలో అది వీపరతంగా వైరల్‌ అయ్యింది. ప్రేమమ్‌లో నా పాత్రను ప్రశంసలు రాగా..ఈ వీడియోతో విమర్శలు వచ్చాయి. దారుణమైన కామెంట్స్‌ చేశారు. అవి చూసి చాలా బాధపడ్డాను. ఇబ్బందిగా అనిపించింది. ఇక ఆ క్షణం నుంచి పొట్టి బట్టలు వేసుకోవద్దని నిర్ణయించుకున్న’ అంటూ వివరించింది సాయి పల్లవి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి