
saiee manjrekar love with producer son
Saiee Manjrekar : ఈ మధ్య కాలంలో కుర్ర భామలు తెగ ప్రేమలో మునిగి తేలుతున్నారు. షూటింగ్స్‌లో పరిచయం కావడం, కొద్ది రోజులకి ఒకరికొకరు దగ్గర కావడం, అలా ప్రేమ చిగురిస్తుంది. దబాంగ్ 3 చిత్రంతో పాపులర్ అయిన సాయి మంజ్రేకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన గని అనే సినిమా చేస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్య విడుదలైన రోమియో జూలియట్ పాటకు కూడా మంచి స్పందన వస్తోంది.
లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు.సాయి మంజ్రేకర్ అడవి శేష్ మేజర్ కూడా చేస్తుంది. అయితే అమ్మడు ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాత కొడుకుతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరద్దరు జంటగా ముంబైలో పలుమార్లు లంచ్, డిన్నర్ డేట్స్‌కు వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
saiee manjrekar love with producer son
స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో సాయి మంజ్రేకర్ తెగ చెట్టాపట్టాలు వేసుకొని తిరగడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు వారి పెళ్లి జరిపించడం ఖాయం అంటూ కొందరు జోస్యాలు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుభాన్ త్వరలోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.